అఖండ భూమి వెబ్ న్యూస్ :
వరి నాట్లు వేయడానికి సిద్ధంగా ఉన్న రైతులు
అధికారులు రైతులకు ఎరువులు కొరత లేకుండా చూడగలరు
అల్లూరి జిల్లా రంపచోడవరం నియోజకవర్గం రాజవొమ్మంగి
ఖరీఫ్ సీజన్లో భాగంగా రైతులు వ్యవసాయ పనులతో బిజీగా ఉన్నారు.. నిలకడగా కురుస్తున్న వర్షాలు కారణంగా పొలాల్లోకి నీరు చేరింది.. మరోపక్క వరి నారుమళ్లు ఏపుగా ఎదగడంతో రైతులు వరి నాట్లు వెయ్యడానికి దమ్ము చేసి సిద్ధంగా ఉన్నారు.. నాట్లు పూర్తి అయ్యేలోపు అధికారులు ఎరువులను సిద్ధంగా ఉంచితే రైతులకు ఎంతో ఉపయోగంగా ఉంటుంది.. రాజవొమ్మంగి మండలంలో ప్రతి సంవత్సరం వేల ఎకరాల్లో వరి పంటను రైతులు పండిస్తారు. అప్పలరాజుపేట, వట్టిగడ్డ, జడ్డంగి, వాతంగి బడదనాపల్లి మొదలైన
గ్రామాల్లో రైతులు వరి పంటను ఎక్కువగా పండిస్తారు. ప్రస్తుతం వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అన్నదాతలు వరి నాట్లు వేసుకునే ప్రయత్నంలో ఉన్నారు. ఇప్పటికే కొన్ని చోట్ల నాట్లు వేస్తుండగా, మరి కొంతమంది రైతులు పొలాల్లో దమ్ము చేయిస్తున్నారు. వాతావరణం పరిస్థితులు అనుకూలంగా ఉన్న నేపథ్యంలో కొద్ది రోజుల్లో రైతులు నాట్లు పూర్తి చేసే అవకాశం ఎక్కువగా ఉంది. రైతులకు అవసరమైన ఎరువులను అధికారులు సిద్ధంగా ఉంచితే ప్రయోజనం ఉంటుంది. వ్యవసాయ శాఖ అధికారులు ఈ విషయం పై దృష్టి సారించి రైతులకు ఎటువంటి ఎరువులు అవసరం అవుతాయో అందుబాటులో ఉంచే ప్రయత్నాలు చేయాల్సి ఉంది.
You may also like
శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి నిఆహ్వానించిన ఆలయ ఈవో యం శ్రీనివాసరావు
శ్రీశైలం దేవస్థానంలో జరగబోయే దసరా మహోత్సవాలకుముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు,లవారికి ఆహ్వానం
శ్రీశైలం మండలంసున్నిపెంట లో నిన్నఅనారోగ్యంతో మరణించిన చింత గుంట్ల రమేష్ ,వారి కుటుంబానికిఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి ఆర్థిక సహాయం
తెలంగాణ మద్యం శ్రీశైలంలో పట్టివేత ఇద్దరు వ్యక్తులు అరెస్ట్
ఉచిత వైద్య శిబిరం విజయవంతం..