NIA: భారీ కుట్రకు ప్రణాళిక.. అందుకే ఆర్కే భార్య శిరీష, దుడ్డు ప్రభాకర్ అరెస్టు: ఎన్‌ఐఏ
ఒంగోలు: మావోయిస్టు అగ్రనేత ఆర్కే భార్య శిరీషను ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం ఆలకూరపాడులో నిన్న జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఏ) అధికారులు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే.
శిరీషను అరెస్టు చేసినట్టు ఎన్‌ఏఏ శనివారం ప్రకటన విడుదల చేసింది. ఆర్కే డైరీ ఆధారంగా శిరీషతో పాటు దుడ్డు ప్రభాకర్‌ను కూడా అరెస్టు చేశామని తెలిపింది.
దుడ్డు ప్రభాకర్, శిరీష మావోయిస్టుల కోసం పనిచేస్తున్నారని పేర్కొంది. మావోయిస్టుల నుంచి పెద్ద ఎత్తున నిధులు తీసుకున్నట్టు గుర్తించామని ఎన్‌ఐఏ తెలిపింది. 2019లో జరిగిన తిరియా ఎన్‌కౌంటర్లో వీరిద్దరూ పాల్గొన్నారని, మావోయిస్టు వారోత్సవాల సందర్భంగా భారీ కుట్రకు ప్రణాళిక సిద్ధం చేశారని ఎన్‌ఏఏ విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది.
”జులై 28న సమావేశం ఏర్పాటు చేసుకొని భారీ కుట్ర పన్నేందుకు మావోయిస్టు కేడర్ ప్రణాళిక సిద్ధం చేసుకున్నట్టు తెలిసింది. వీరు రాసిన లేఖలు, సాహిత్య పుస్తకాలతో పాటు భారీగా ఆయుధాలు, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నాం” అని ఎన్‌ఐఏ వివరించింది..
You may also like
చెత్త నుండి సంపద సృష్టి — పరిశుభ్రమైన యర్రగొండపాలెం కోసం గూడూరి ఎరిక్షన్ బాబు
ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు మిన్న
దత్తత గ్రామం అల్లిపూడి అభివృద్ధికి యనమల దివ్య భరోసా: సమస్యల పరిష్కారానికి హామీల జల్లు
రాజమహేంద్రవరం అభివృద్ధిపై శ్వేత పత్రం విడుదల చేయాలి
అంగరంగ వైభవంగా “మేడా” జన్మదిన వేడుకలు జరిగాయి …



