పాఠశాలను ఆకస్మిక తనిఖీ చేసిన విద్యాశాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్..

 

ఎస్.రాయవరం మండలంలోని రేవుపోలవరం ప్రాధమిక పాఠశాలను విద్యాశాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్బంగా పాఠశాల తరగతి గదులను తనిఖీ చేసిన అనంతరం విద్యార్థులతో ముచ్చటించారు విద్యార్థుల పాఠ్యపుస్తకాలను పరిశీలించిన ఆయన విద్యార్థుల పుస్తకాల్లో తప్పుడు సమాధానాలకు కూడా రైట్ మార్కులు వేసిన ఉపాధ్యాయులను నిలదీశారు విద్యార్థుల పట్ల అలసత్వం ప్రదర్శిస్తే సహించబోనని రాష్ట్ర ప్రభుత్వం కొన్ని వేల కోట్లరూపాయలను విద్య కోసం కేటాయిస్తోందని మెరుగైన ఫలితాలతో విద్యా ప్రమాణాలు మెరుగుపరిచేలా ప్రణాళికలు రూపొందించి అమలు చేస్తుంటే ఉపాధ్యాయులు విద్యార్థుల పట్ల శ్రద్ద తీసుకోకుండా వ్యవహారిస్తున్నారని ఆయన మండిపడ్డారు పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీనివాసరావును ప్రత్యేక తరగతులపై ఆరా తీశారు విద్యార్థిని విద్యార్థులకు చదుకోవడం వల్ల కలిగే లాభాలను విద్య యొక్క ఆవశ్యకతను వివరించి పాఠ్యపుస్తకాలను పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో అనకాపల్లి జిల్లా కలెక్టర్ రవి పట్టన్ శెట్టి రీజనల్ జాయింట్ సెక్రటరీ జ్యోతి కుమారి జిల్లా విద్యాశాఖాధికారిణి వెంకట మహాలక్ష్మమ్మ సమగ్ర శిక్షణాధికారులు శ్రీలక్ష్మి, శకుంతల ఆర్డివో జయరామ్ ఎస్.రాయవరం తహసీల్దార్ విజయ్ కుమార్ డిప్యూటీ తహసీల్దార్ శ్యామ్ కుమార్ ఎంపిడివో రామచంద్ర మూర్తి, ఎంఈవోలు అప్పారావు మూర్తి ఇంజనీరింగ్ ఏఈ డిఈలు ప్రధానోపాధ్యాయులు శ్రీనివాసరావు గ్రామ సర్పంచ్ అప్పన్న పాఠశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Akhand Bhoomi News

error: Content is protected !!