గ్రామాల అభివృద్ధి మా ప్రభుత్వ లక్ష్యం

అఖండ భూమి నాతవరం

ఎన్డీఏ కూటమి ప్రభుత్వం గ్రామాల అభివృద్ధి దిశగా ఒక లక్ష్యం ఏర్పాటు చేసుకొని ముందుకు వెళుతుందని మాజీ జడ్పిటిసి కరక సత్యనారాయణ అన్నారు. ఆదివారం తన నివాసంలో మీడియాతో మాట్లాడుతూ గత ప్రభుత్వం వైఫల్యాలే ప్రస్తుతం శాపాలుగా మారాయని అంటూ ప్రభుత్వం ఏర్పడి 90 రోజుల్లోనే శాసన సభాపతి చింతకాయల అయ్యన్నపాత్రుడు ద్వారా నాతవరం మండలంలో చెర్లోపాలెం గ్రామం కి సంపూర్ణ శాశ్వత అభివృద్ధి కొరకు 6.80 కోట్లు కేటాయించడం జరిగిందని తాండ్ర ప్రాజెక్టు గేట్లు మరమ్మత్తుకి 20 లక్షలు మండలంలో సిసి రోడ్లు నిర్మాణము కొరకు 9 కోట్లు 50 లక్షలు మండలంలో స్మశానాల అభివృద్ధికి ఒక కోటి 50 లక్షలు తాళ్లపాలెం నుండి వడపర్తి వరకు రోడ్డు నిర్మాణం కొరకు ఒక కోటి 40 లక్షలు వెదురుపల్లి నుండి గొలుగొండపేట వరకు బీటీ రోడ్ నిర్మాణం కొరకు 68 లక్షలు మంజూరు చేసినట్లు చెప్పారు. నాతవరం మండలం తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు నందిపల్లి వెంకటరమణ మాట్లాడుతూ 2014 నుండి 2019 వరకు హౌసింగ్ నిర్మాణము లు చేపట్టిన లబ్ధిదారుల బిల్లులు గత ప్రభుత్వము నిలిపివేయడం వలన ఇప్పుడు మరలా లబ్ధిదారుల జాబితాను పునరుద్ధరించి లబ్ధిదారుల వద్దకే వచ్చి హౌసింగ్ వెరిఫికేషన్ ద్వారా పెండింగ్ బకాయిలను విడుదల చేస్తామని స్థానిక నాయకులు పూర్తిగా సహకరించాలని ఆయన అన్నారు. మాజీ ఎంపీపీ సింగంపల్లి సన్యాసి దేవుడు మాట్లాడుతూ గత ప్రభుత్వంలో వైయస్సార్ నాయకులు మేలు పొందారు తప్ప గ్రామాల అభివృద్ధి ఎక్కడా లేదని గన్నవరం మెట్ట సమీపంలో గల ఎదురులు గెడ్డ బ్రిడ్జి నిర్మాణానికి గత ప్రభుత్వం తూతూ మంత్రంగా శంకుస్థాపన చేసి పనులు నేటి వరకు చేపట్టలేదని అన్నారు. దీనిపై శాసన సభాపతి అయ్యన్నపాత్రుడు అధికారులను పిలిపించి అంచనా వేసి ప్రతిపాదనలు పంపడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ అప్పిరెడ్డి మాణిక్యం, ఐ టి డి పి ఇంచార్జ్ శెట్టి గోపి, పిన్ని రెడ్డి జోగారావు, మిరపల దొరబాబు, చింతకాయల శ్రీను, శెట్టి నాయుడు, పిన్ని రెడ్డి వాసు, సొర్ల వెంకటరమణ, పోతురాజు తదితరులు పాల్గొన్నారు.

Akhand Bhoomi News

error: Content is protected !!