చెత్త సేకరణ ట్రాలీ అద్దాలను ధ్వంసం చేసిన కౌన్సిలర్..?

 

చెత్త సేకరణ ట్రాలీ అద్దాలను ధ్వంసం చేసిన కౌన్సిలర్..?

-ప్రజా పాలన దినోత్సవం రోజు ఆర్మూర్ మున్సిపాలిటీలో అపశృతి..

-చరిత్రకెక్కిన ఆర్మూర్ మున్సిపల్ ఘటన..

నిజామాబాద్ జిల్లా ప్రతినిధి సెప్టెంబర్: 17 (అఖండ భూమి) ఆర్మూర్ మున్సిపల్ కార్యాలయంలో మంగళవారం తలపెట్టిన ప్రజా పాలన దినోత్సవం లో అపశృతి చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే మున్సిపల్ పరిధిలోని 36వ. వార్డుకు చెత్త సేకరణ బండి రావడం లేదని వార్డు ప్రజలు కౌన్సిలర్ బారడ్ రమేష్ కు పలుమార్లు ఫిర్యాదు చేశారు. కౌన్సిలర్ మున్సిపల్ అధికారులకు చెత్త బండి పంపించాలని ఎన్నోసార్లు చెప్పిన పట్టించుకోకపోవడంతో వార్డు ప్రజలు పెడుతున్న టార్చర్ను భరించలేక ప్రజా పాలన దినోత్సవం లో మున్సిపల్ అధికారులతో కౌన్సిలర్ రమేష్ వాగ్వాదానికి దిగాడు. ప్రజా పాలన దినోత్సవం రోజు నూతన చెత్త సేకరణ బండ్ల ప్రారంభోత్సవాన్ని నిర్వహించేందుకు పూలమాలలు వేసి సిద్ధం చేసిన వాహన అద్దాలను కౌన్సిలర్ రమేష్ ధ్వంసం చేయడం ఆర్మూర్ మున్సిపల్ అధికారులతో పాటు. పట్టణ ప్రజలు విస్మయానికి గురయ్యారు.వార్డు ప్రజలు ఒత్తిడి చేయడంతో ఆగ్రహానికి లోనై అద్దాలను ధ్వంసం చేయడం లో కౌన్సిలర్ తప్ప ఏమీ లేదని పట్టణ. వార్డు ప్రజలు చెప్పుకుంటున్నారు. మొత్తానికి ఇంతవరకు

ఏ మున్సిపాలిటీలలో జరగని ఇటువంటి ఘటన ఆర్మూర్ మున్సిపాలిటీలో జరగడం చరిత్రకెక్కింది.

Akhand Bhoomi News

error: Content is protected !!