ఎస్ఎస్ఎన్ యూత్ వినాయక మండలి ఆధ్వర్యంలో నారాయణసేవ కార్యక్రమం

ముఖ్య అతిధిగా హాజరైన బెల్లంపల్లి ఏ సి పీ రవికుమార్
బెల్లంపల్లి సెప్టెంబర్ 13(అఖండభూమి):బెల్లంపల్లిపట్టణంలోని
18 వ వార్డు శంషీర్ నగర్ బస్తిఎస్ఎస్ఎన్ యూత్
వినాయక మండలిఆహ్వానం మేరకు
శుక్రవారం రోజు బెల్లంపల్లిఏసీపీ రవి కుమార్ విచ్చేసి
విగ్నేశ్వర స్వామి వారికికొబ్బరికాయ కొట్టి
పూజ కార్యక్రమంలో పాల్గొని అన్నప్రసాదం పంపిణీ చేసారు.
గణేష్ మండపానికి విచ్చేసినబెల్లంపల్లి ఏసీపీ రవి కుమార్ ను కమిటీ సభ్యులుశాలువాతో సన్మానించినారు.
ఏసీపీ మాట్లాడుతూ…నేటి యువత చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని అదేవిధంగా భక్తి మార్గంలో ముందుగు సాగుతూ సనాతన భక్తి మార్గంలో స్వచ్చంద కార్యక్రమలలో నిత్యం పాల్గొనాలని సూచించారు.అదేవిధంగ
వినాయక నిమజ్జనం ఉత్సవాలలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకొకుండా శోభ యాత్ర ప్రశాంత వాతావరణంలో కొనసాగేందుకు సహకరించాలని అన్నారు.
వినాయక మండపాల వద్దశోభ యాత్రలలో డీజే సౌండ్లకు
సుప్రీంకోర్టు ఉత్తర్వుల మేరకు ఎలాంటి అనుమతులు లేవనిశోభ యాత్రలలోఎవరైనా మద్యం సేవించిపాల్గొంటే చట్ట పరమైనచర్యలుంటాయని అన్నారు.ఈ కార్యక్రమంలోఎస్ ఎస్ ఎన్ యూత్ సభ్యులు కుంభాల రాజేష్,చిలగాని కుమార్,తడిగొప్పుల శ్యామ్ శేఖర్,మోగిలి రాకేష్,కోడిపెల్లి భరత్,నారా సంపత్,అరిగెల విలాస్,గడ్డి మహేష్,సాయి,చింటూ,శ్రీకర్,అంజి,సాయి కృష్ణ,బాబీ,దాసరి ప్రతాప్,భూపెల్లి శ్రీధర్,తదితరులు పాల్గొన్నారు…
You may also like
మన ఓటు – మన రాజ్యం నినాదం తో దళితుల రక్షణ – రాజ్యాధికారం సాధన . దళిత బహుజన పార్టీ అధినేత: కృష్ణ స్వరూప్
కాకినాడలో ఘోరం: భరత్ నందన్ ప్రేమ వంచనకు నర్సు ప్రమీల బలి.. ఆత్మహత్య కాదు, పక్కా ప్లాన్డ్ హత్యే: నిందితుడిని ఉరితీయాలని బంధువుల డిమాండ్!
బ్రేకింగ్: ఇచ్చిన మాట నిలబెట్టుకున్న మంత్రి నారా లోకేష్.. తోట చంద్రయ్య కుమారుడికి ప్రభుత్వ ఉద్యోగం!
దత్తత గ్రామం అల్లిపూడి అభివృద్ధికి యనమల దివ్య భరోసా: సమస్యల పరిష్కారానికి హామీల జల్లు
సింగరేణి రిటైర్డ్ కార్మికుల గ్రాడ్యుటి డబ్బులు ఇప్పించాలని మంచిర్యాల జిల్లా కలెక్టర్ కు వినతి


