Pawan Kalyan: ఆర్భాటాలు కాదు.. పాఠశాలల్లో మరుగుదొడ్లు నిర్మించండి: పవన్ కల్యాణ్..
అమరావతి: బైజూస్‌ను చూపించి రాష్ట్ర ప్రభుత్వం మోసం చేస్తోందని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. బైజూస్ ద్వారా ఏదో సాధించామని ప్రభుత్వం చెబుతోందన్నారు..
ఆర్భాటాలు కాదు.. ముందు పాఠశాలల్లో మరుగుదొడ్లు నిర్మించాలని పవన్ సూచించారు. ”మెగా డీఎస్సీ నోటిఫికేషన్ ఊసే లేదు. ఉపాధ్యాయుల భర్తీ చేపట్టలేదు.
వారికి శిక్షణ ఇవ్వడం లేదు. నష్టాలు వచ్చే స్టార్టప్‌కు మాత్రం రూ.కోట్ల కాంట్రాక్టు ఇచ్చారు. టెండర్ కోసం ఎన్ని కంపెనీలు దరఖాస్తు చేశాయి? టెండర్ల ప్రక్రియలో ప్రమాణాలను ప్రభుత్వం పాటించిందా? ఆ కంపెనీలను ఎవరు పరిశీలించారు?వాటికి సంబంధించిన వివరాలు ఆన్‌లైన్‌లో ఉంచారా? టెండరు, కంపెనీ ఎంపిక అంశాలపై ప్రభుత్వం స్పందించాలి” అని పవన్ కల్యాణ్ డిమాండ్ చేశారు..
You may also like
శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి నిఆహ్వానించిన ఆలయ ఈవో యం శ్రీనివాసరావు
శ్రీశైలం దేవస్థానంలో జరగబోయే దసరా మహోత్సవాలకుముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు,లవారికి ఆహ్వానం
శ్రీశైలం మండలంసున్నిపెంట లో నిన్నఅనారోగ్యంతో మరణించిన చింత గుంట్ల రమేష్ ,వారి కుటుంబానికిఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి ఆర్థిక సహాయం
తెలంగాణ మద్యం శ్రీశైలంలో పట్టివేత ఇద్దరు వ్యక్తులు అరెస్ట్
ఉచిత వైద్య శిబిరం విజయవంతం..