తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఇప్పటికే రాష్ట్రాలలో భారీ వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే. దీంతో రానున్న మూడు రోజుల పాటు ఏపీ, తెలంగాణలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని, పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని, ప్రజలందరూ జాగ్రత్తగా ఉండాలని వాతావరణశాఖ పేర్కొంది. ఇక ఈరోజు హైదరాబాద్‌లో భారీ వర్షం కురుస్తున్న విషయం తెలిసిందే. భాగ్యనగరంలో దట్టమైన మేఘాలు కమ్ముకున్నాయి. ఉదయం 5 గంటల నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుంది.*

ANDHRA BREAKING NEWS NEWS PAPER STATE TELANGANA