స్వర్గీయ లక్ష్మీప్రసాద్ ఆశయాన్ని నెరవేర్చిన “బివియల్ ప్రజలకు చేయూత” గ్రూపు సభ్యులు.

 

స్వర్గీయ లక్ష్మీప్రసాద్ ఆశయాన్ని నెరవేర్చిన “బివియల్ ప్రజలకు చేయూత” గ్రూపు సభ్యులు.

 

ఆలమూరు (అఖండ భూమి):కొత్తపేట నియోజకవర్గం ఆలమూరు మండలం బడుగువానిలంక గ్రామం గోదావరి చెంతనే ఉన్న భూగర్భ జలాలు లోతులో ఉండడంతో ఆ గ్రామంలోని ప్రజలకు మంచినీరు కొరత ఉండేది.దానిని గుర్తించిన అదే గ్రామానికి చెందిన దాత స్వర్గీయ యెరుబండి లక్ష్మీప్రసాద్ తన తండ్రి శ్యామలరావు జ్ఞాపకార్థం లక్షలాది రూపాయల ఖర్చుతో మార్చి 2018 సంవత్సరంలో ఆర్.వో (రివర్స్ ఓస్మోసిస్)ప్లాంట్ ను ఏర్పాటు చేసి ప్రజలకు మంచినీటి సౌకర్యాన్ని ఉచితంగా అందుబాటులోకి తెచ్చారు.రివర్స్ ఓస్మాసిస్ అనేది ఒక నిర్దిష్ట వడపోత ప్రక్రియ.వాటర్ ప్లాంట్లులలో పోర్టబుల్ నీటి ఉత్పత్తికి ఆర్వో సాంకేతికత ప్రధానంగా వర్తిస్తుంది.రివర్స్ ఓస్మోసిస్ సస్పెండ్ చేయబడిన సూక్ష్మజీవులు మరియు బ్యాక్టీరియా వంటి వాటిని నీటిలో కరిగిపోయిన రకాలను తొలగిస్తుంది.కాగా లక్ష్మీ ప్రసాద్ ఇటీవల కాలంలో దైవ సన్నిధికి చేరడంతో ఆర్వో ప్లాంట్ నిర్వహణ లేకపోవడంతో శిధిలావస్థకు చేరి గత కొన్ని నెలలుగా పని చేయడం లేదు.దాత ఆశయాన్ని గుర్తించిన “బివియల్(బడుగువానిలంక) ప్రజలకు చేయూత” గ్రూపు సభ్యులు తమ విరాళాలతో ఆధునీకరించగా,ఎన్ఆర్ఐ అత్తిలి రమేష్ గౌడ్ తన తండ్రి ఆదినారాయణ జ్ఞాపకార్థం ఆర్వో ప్లాంట్ కు సరిపడే నిత్యము నీరును అందించేందుకు విద్యుత్ మోటార్ ను సమకూర్చాగా,ఆదివారం స్వర్గీయ లక్ష్మీ ప్రసాద్ వారసులైన శ్యామ్,నిక్షిత చేతుల మీదుగా పునఃప్రారంభించడంతో గ్రామ ప్రజలకు శుద్ధి చేసిన మంచినీరు అందుబాటులోకి రావడంతో గ్రామ ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో బడుగువానిలంక గ్రామ పెద్దలు,ప్రజలు పాల్గొన్నారు.

Akhand Bhoomi News

error: Content is protected !!