పాల్వంచ సామాజిక ఆరోగ్య కేంద్రం సేవలు బేష్
కార్పొరేట్ హాస్పిటల్ కి ధీటుగా డాక్టర్ నూకల సింధు సేవలు
భద్రాద్రి కొత్తగూడెం, ప్రతినిధి జులై 23(అఖండభూమి) బూర్గంపహాడ్ మండలం లో సోంపల్లి గ్రాస్తులు గత నెల నుండీ డెంగ్యూ జ్వరాలతో ప్రజలు కొట్టుమిట్టాడుతున్నారు మీకు ఎలాంటి భయం వద్దు నేనున్నా అంటున్న డాక్టర్ సింధు.ఎంత మంది నైనా అనారోగ్య పరిస్తితిలో హాస్పిటల్ లో చేర్చుకోండి పడకలు లేవని చెప్పొద్దు అని సూపరిటెండెంట్ ఆజ్ఞతో గడిచిన15 రోజుల్లో 15 నుండి 20 మంది సోంపల్లి గ్రామస్థులు డెంగ్యూతో హాస్పిటల్ లో జాయిన్ అయ్యరు.100% చికిత్స నర్సుల సేవలు బేష్ అంటున్న సోంపల్లి గ్రామప్రజలు తండోప తండాలుగా పాల్వంచ ఆసుపత్రిలో సోంపల్లి గ్రామస్థులు వివరాల్లోకి వెళితే పెంకే అనసూర్య సోంపల్లి గ్రామస్థురాలు డెంగ్యూ జ్వరంతో బాధ పడుతూ పాల్వంచ ప్రభుత్వం హాస్పిటల్ కి వెళ్ళగా కార్పోరేట్ హాస్పిటల్ కి ధీటుగా డా. నూకల సింధు వైద్య సేవలు అందించి పేద ప్రజల పక్షంగా నేను ఉన్నా అని మనోధైర్యం నింపుతూ మంచి సేవలు అందించి మూడు రోజుల్లో పూర్తిగా క్యూర్ చేసి ఇంటికి పంపించారు డాక్టర్ సింధు మరియు వారి సిబ్బంది డెంగ్యూ ఫీవర్ కి కార్పోరేట్ హాస్పిటల్ లో రకరాల టెస్ట్ లు చేసి 20 వేల నుండి 30 వేల వరకు గుంజుకుంటున్న ఈ రోజుల్లో రూపాయి ఖర్చు లేకుండా పూర్తి ఆరోగ్యంతో ఇంటికి వచ్చిన అనసూర్యని చూసిన కుటుంబసభ్యులు డాక్టర్ సింధు అలాగే సిబ్బందిని ప్రశంసించారు. అంతే కాకుండా అదే సోంపల్లి గ్రామానికి చెందిన నస్కూరి రాకేష్ , బింగి శివరామ్ , బోరెం సంపత్ , పెంకె ప్రేమలత ,పెంకే వెంకటేశ్వర్లు , బత్తుల సాయి సందీప్ , నస్కూరి వెంకట్రావు , నస్కూరి సుజాత ,పొందు లక్ష్మి, పెంకే ఈశ్వరమ్మ, బింగి వెంకటేశ్వర్లు,బోరెం జయ అను రోగులు కూడా డెంగ్యూతో బాధ పడుతున్నారు
వీరికి చెప్పగ వారు కూడా పాల్వంచ కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌లో అడ్మిట్ అయ్యి ట్రీట్‌మెంట్ తీసుకుంటున్నారు.ఇంకా సోంపల్లి గ్రామ నుండి అనేక మంది ప్రజలు చికిత్స నిమితం వెళ్లి సంతోషంగా అక్కడ సేవ లుని చూసి గ్రామస్థులకు తెలియ చేస్తున్నారు. ఇంకా మరిన్ని సేవలు అనేక మంది పేదల జీవితంలో వెలుగు నింపాలని అని డా.సింధుని సోంపల్లి గ్రామస్థులు కోరుకుతున్నారు.



