మైనారిటీలకు రూ.లక్ష ఆర్థికసాయం.. ఉత్తర్వులు జారీ..

 

TS Govt: మైనారిటీలకు రూ.లక్ష ఆర్థికసాయం.. ఉత్తర్వులు జారీ..

హైదరాబాద్‌: రాష్ట్రంలో బీసీలకు అందిస్తున్న తరహాలోనే మైనారిటీలకూ రూ.లక్ష ఆర్థిక సాయాన్ని పూర్తి సబ్సిడీతో అందివ్వాలని తెలంగాణ సీఎం కేసీఆర్‌ నిర్ణయించారు..

కులమతాలకు అతీతంగా పేదరికాన్ని పారదోలాలనే దార్శనికతతో రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తోందని ఈ సందర్భంగా సీఎం పేర్కొన్నారు. దీనిలో భాగంగా ఇప్పటికే అన్ని వర్గాల పేదలకు ప్రభుత్వం తోడ్పాటు అందిస్తోందని చెప్పారు. మైనారిటీల అభివృద్ధి, సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని కేసీఆర్‌ పునరుద్ఘాటించారు. భిన్న సంస్కృతులను, విభిన్న మతాల ఆచార సంప్రదాయాలను సమానంగా ఆదరిస్తూ రాష్ట్రంలో గంగా జమునా తెహజీబ్‌ను కాపాడే ప్రక్రియ కొనసాగుతూనే ఉంటుందన్నారు..

విద్య, ఉపాధి సహా వివిధ రంగాల్లో ఇప్పటికే పలు పథకాలను అమలు చేస్తూ మైనారిటీల్లోని పేదరికాన్ని, వెనుకబాటును తొలగించేందుకు కృషి కొనసాగుతోందని సీఎం చెప్పారు. ఈ దిశగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సమర్థమైన కార్యాచరణ సత్ఫలితాలను అందిస్తుందని కేసీఆర్‌పేర్కొన్నారు..

Akhand Bhoomi News

error: Content is protected !!