CM Jagan: కోడికత్తి కేసులో సీఎం జగన్ పిటిషన్‌ను తోసిపుచ్చిన ఎన్‌ఐఏ కోర్టు..
విజయవాడ: కోడి కత్తి కేసులో కుట్ర కోణంపై మరింత లోతుగా దర్యాప్తు చేయాలని జగన్ తరఫు న్యాయవాది దాఖలు చేసిన పిటిషన్‌ను విజయవాడ ఎన్‌ఐఏ కోర్టు కొట్టివేసింది..
వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు కోరుతూ జగన్ వేసిన పిటిషన్‌పై వచ్చే నెల 1న విచారణ జరుపుతామని కోర్టు తెలిపింది. నిందితుడు శ్రీనివాస్ నాలుగేళ్లుగా జైల్లోనే ఉన్నారని, బెయిల్ ఇవ్వాలని కోరుతూ దాఖలు చేసిన పిటిషన్ పైనా ఆగస్టు 1న విచారణ చేపడతామని ధర్మాసనం తెలిపింది. ప్రస్తుతం నిందితుడు శ్రీనివాస్ రాజమహేంద్రవరం జైల్లో ఉన్నారని.. విజయవాడ ఎన్‌ఐఏ కోర్టులో రెగ్యులర్ విచారణకు హాజరుకావడం ఇబ్బంది మారిందని అతని తరఫు న్యాయవాది ధర్మాసనం దృష్టికి తెచ్చారు. దీనిపై న్యాయమూర్తి.. జైలు సూపరింటెండెంట్ వివరణ కోరారు. రాజమహేంద్రవరం జైల్లో రద్దీ ఎక్కువగా ఉంటుందని, ఎన్‌ఐఏ కేసులో రిమాండ్‌లో ఉన్న ఖైదీకి జైలు నుంచే విచారణ సాధ్యం కాదని కోర్టు దృష్టికి తెచ్చారు..



