అంగరంగ వైభవంగా అల్లుగుండు లో దస్తగిరి స్వామి సరిగెత్తు…
కర్నూలు జిల్లా వెల్దుర్తి జులై 26 అఖండ భూమి వెబ్ : మండల పరిధిలోని అల్లు గుండు గ్రామంలో బుధవారం దస్తగిరి స్వామి సరిగెత్తు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలోని ఇంటింటికి పూల సూచికల బాజా భజంత్రీలుతో ఎంతో వైభవంగా సంబరాలు జరుపుకున్నారు. గ్రామంలో పెద్దమనుషుల సమక్షంలో ఎంతో భక్తి శ్రద్ధలతో వేడుకలు నిర్వహించారు. కుల మతాలకు అతీతంగా దస్తగిరి స్వామి సరిగెత్తు నిర్వహించడం జరిగింది. ప్రతి సంవత్సరం మాబు సాహెబ్ స్వామివారిని గ్రామంలో పురవీధుల గుండా నిర్వహించేవారు. ఈ ఏడాది తన కుమారుడైనటువంటి దస్తగిరికి దస్తగిరి స్వామి పూనకం రావడంతో అగ్నిగుండం తొక్కి నిప్పులు చెరిగి దస్తగిరి స్వామి భక్తిని ఆయన మహిమలను చాటాడు. దీంతో గ్రామస్తులు భక్తులు ఉక్కిరిబిక్కిరై ఆయన భక్తికి ముగ్ధులై కేరింతలు పెట్టారు. దీంతో స్వామివారి ఆశీస్సులను పొంది బాధ్యతను నిరూపించుకున్నాడు. ఈ వేడుకలు సందర్భంగా గ్రామస్తులంతా ఐకమత్యంతో ఎటువంటి గొడవలకు తావు లేకుండా మోహరం వేడుకలను ఎంతో భక్తిశ్రద్ధలతో నిర్వహించారు ఈ మొహరం వేడుకలకు చుట్టుపక్కల గ్రామాల నుండే కాకుండా ఇతర జిల్లాల నుండి వచ్చి వారి వారి మొక్కలను తీర్చుకున్నారు.


