

పట్టించుకోని గ్రామ సర్పంచ్…
అపరిశుభ్రంగా దర్శనమిస్తున్న చెత్త కుప్పలు…
పట్టించుకోని గ్రామ కార్యదర్శి..
అల్లు గుండు (వెల్దుర్తి) అక్టోబర్ 25 (అఖండ భూమి న్యూస్) : మండల పరిధిలోని అల్లుకుంటూ గ్రామంలో ప్రబలుతున్న డెంగ్యూ జ్వరాలు, మలేరియా విష జ్వరాలతో గ్రామీణ ప్రజలు అల్లాడుతున్నారు. గ్రామంలో ఎక్కడ చూసినా నీరు నిలవ ఉన్న మురికి కాలువలు, చెత్త కుప్పలు దర్శనమిస్తున్నాయి. గ్రామ సర్పంచ్ గ్రామంలో అపరిశుభ్రంగా ఉన్నా కూడా పట్టించుకున్న పాపాన పోలేదని గ్రామ ప్రజలు విమర్శిస్తున్నారు. గ్రామానికి చెందిన గజ్జి ఎల్లయ్య, గజ్జి అనితల కుటుంబంలో ఇద్దరు కుమారులైనటువంటి అఖిల్ అభిరాములకు డెంగ్యూ జ్వరాలతో ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స పొందుతున్నారు. గత వారం రోజుల క్రిందట నాలుగు నుండి ఐదుగురు వరకు డెలివరీ కేసులు ఉన్నట్లు వైద్యులు తెలిపారు. గ్రామంలో చెత్తకుప్పలు నీటి నిల్వలు ఎక్కువగా ఉండడంతో డెంగ్యూ మలేరియా విష జ్వరాలు వైరల్ ఫీవర్లు గ్రామంలో విషం చింపిస్తున్నాయి. పంచాయతీ కార్యదర్శులు మాత్రం పట్టించుకున్న పాపాన పోలేదని గ్రామ ప్రజలు వాపోతున్నారు. గ్రామంలో మొరిగే కాలువలు చెత్తకుప్పలు తొలగించకుండా అలాగే నిల్వ ఉంచడంతో విష జ్వరాలు గ్రామం నిండా ఉన్నాయని ప్రజలు తెలుపుతున్నారు. దీంతోపాటు గ్రామ సర్పంచ్, అధికారులు బ్లీచింగ్ పౌడర్ కూడా చల్లకుండా ఇష్ట రాజ్యాంగ వ్యవహరిస్తున్నట్లు గ్రామీణ ప్రజలు తెలుపుతున్నారు. గ్రీన్ అంబాసిడర్లకు జీతభత్యంలో ఇవ్వకుండా మధ్యలోనే ఆపడంతో గ్రామంలో ఎక్కడ వేసిన చెత్తకుప్పలో అక్కడే ఉన్నట్లు ప్రజలు తెలుపుతున్నారు. సంబంధిత మండల అధికారులు ప్రత్యేకమైన చర్యలు తీసుకొని గ్రామంలో అపరిశుభ్రత లేకుండా బ్లీచింగ్ పౌడర్ చల్లించి గ్రీన్ అంబాసిడర్లకు జీతభత్యాలు ఇవ్వాలని కోరుతున్నారు.


