వెల్దుర్తి ప్రభుత్వ ఆసుపత్రి నిండా డెంగ్యూ – విషజ్వరాలు..!

వెల్దుర్తి ప్రభుత్వ ఆసుపత్రి నిండా డెంగ్యూ – విషజ్వరాలు..!

అపరిశుభ్రతతో మండల ప్రజలు అల్లాడుతున్నారు

వెల్దుర్తి, అక్టోబర్ 25 (అఖండ భూమి న్యూస్):

వెల్దుర్తి మండలంలో డెంగ్యూ, మలేరియా, విషజ్వరాలు ప్రజల ప్రాణాలు తీస్తున్న స్థాయికి పెరిగిపోయాయి. మండలంలోని ప్రభుత్వ వైద్యశాలలో ప్రతి బెడ్డు మీదా జ్వరాలతో బాధపడుతున్న రోగులు కనిపిస్తున్నారు. గ్రామాల నుంచి తరలివచ్చిన ప్రజలు ఆసుపత్రిలో అడుగుపెడితే పడక దొరకని పరిస్థితి నెలకొంది. మండలంలోని 1. హర్షిత్ (6)లు సంవత్సరాలు బోయినపల్లి, 2. అభిరామ్ (9)లు అల్లు గుండు, 3. అఖిల్ (11)లు అలుగుండు, 4. నరేష్ (32)లు వెల్దుర్తి, 5. సుకుర్ భాష (50)లు వెల్దుర్తి, 6. విద్యా శృతి(16)లు వెల్దుర్తి. అల్లు గుండు గ్రామంలో ఎక్కువ డెంగ్యూ జ్వరాలు రావడం విశేషం.

– గ్రామాల్లో అపరిశుభ్రతే జ్వరాలకు కారణమా..?

ఈ సందర్భంగా ఆయా గ్రామాల ప్రజల మాటల్లో ….

– పంచాయతీల్లో చెత్త గుట్టలు, మూసుకుపోయిన మురుగుకాలువలు, బ్లీచింగ్ పౌడర్ చల్లకపోవడం ప్రధాన కారణమని వినిపిస్తోంది. గ్రీన్ అంబాసిడర్లను నియమించినా వారికి జీతభత్యాలు ఇవ్వకపోవడంతో పనులు నిలిచిపోయాయని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

– పంచాయతీ కార్యదర్శులు

– సర్పంచుల నిర్లక్ష్యం..!

ప్రతి గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచాల్సిన బాధ్యత ఉన్న పంచాయతీ కార్యదర్శులు, సర్పంచులు తమ కర్తవ్యాల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ప్రజల ఆవేదన. గ్రామాల పరిశుభ్రతపై పర్యవేక్షణ లేకపోవడంతో డెంగ్యూ, మలేరియా కేసులు విపరీతంగా పెరిగిపోయాయి.

– మండల అధికారులు ఎందుకు మౌనంగా..?

జ్వరాల వ్యాప్తి గురించి ప్రజలు ఆందోళన చెందుతున్నప్పటికీ, మండల అధికారులు మాత్రం మౌనం వీడడంలేదు. ఎటువంటి శానిటేషన్ డ్రైవులు, బ్లీచింగ్ పౌడర్ చల్లడం, లేదా అవగాహన కార్యక్రమాలు జరగడం లేదని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

– జిల్లా అధికారుల దృష్టికి..!

డెంగ్యూ, మలేరియా జ్వరాల బారిన పడిన గ్రామాల ప్రజలు జిల్లా కలెక్టర్, జిల్లా వైద్యాధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. గ్రామాలలో ప్రత్యేక శానిటేషన్ డ్రైవ్ నిర్వహించి, పరిశుభ్రతపై కఠిన నిబంధనలు అమలు చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

– ప్రజల ఆకాంక్ష

“ఎప్పుడూ మా గ్రామంలో ఇంత జ్వరం రాలేదు. ఈసారి పరిస్థితి భయంకరంగా ఉంది” అని ప్రజలు వాపోతున్నారు. పరిశుభ్రతపై పంచాయతీలు, అధికారులు క్రమం తప్పకుండా చర్యలు తీసుకోవాలని మండల ప్రజల కోరుతున్నారు.

Akhand Bhoomi News

error: Content is protected !!