*మున్సిపల్ కార్మికుల స్థానిక సమస్యలు పరిష్కరించాలి …
చంద్రశేఖర్ సిఐటియు జిల్లా కన్వీనర్..
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; అక్టోబర్ 25 (అఖండ భూమి న్యూస్);
మున్సిపల్ కమిషనర్ రాజేందర్ రెడ్డిని కలిసి స్థానిక సమస్యల పైన సిఐటియు ఆధ్వర్యంలో శనివారం మెమోరాండం అందించారు. మున్సిపల్ కార్మికులకు కుటుంబంలో చనిపోయిన కార్మికులు 60 సంవత్సరాలు నిండిన కార్మికులు ఇంటిలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని జీవో ఉన్న గాని కామారెడ్డి మున్సిపల్ లో అమలు కావడం లేదు. అనారోగ్య రీత్యా బంద్ అయిన కార్మికులను డ్యూటీలోకి తీసుకోవాలి అని డిమాండ్ చేశారు. తీసివేసిన కార్మికులకు ఐదు నెలల బకాయి జీతాలు అందించి తిరిగి డ్యూటీలోకి తీసుకోవాలి ఆరోగ్యం బాగాలేని కార్మికుల అవసర నిమిత్తం ఉన్నవారికి వదిలిపెట్టుకునే అవకాశాన్ని కల్పించాలన్నారు. సంవత్సరానికి 15 సాధారణ సెలవులు అందించి వారాంతపు సెలవులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ సెలవులు యధావిధిగా పాత పద్ధతిన వాటర్ వర్క్స్ విభాగాలు అమలు చేయాలన్నారు. పీఎఫ్ ఈఎస్ఐ ఒక సంవత్సరం డబ్బులు కటింగ్ అవుతుందని అన్నారు. కార్మికుల అకౌంట్లో ఇప్పటివరకు జమ కాలేదు దీనివలన కార్మికులు చాలా ఇబ్బంది పడుతున్నారు అని ఆవేదన వ్యక్తం చేశారు. ఈఎస్ఐ హాస్పిటల్ లేనందువలన వైద్య సౌకర్యం అందడం లేక అప్పులు చేసి ప్రైవేట్ హాస్పిటల్లో చూపెట్టుకున్న పరిస్థితి , శానిటేషన్ కార్మికుల పట్ల దురుసుగా ప్రవర్తిస్తున్నారు. వారికి నచ్చిన వారికి ఒక విధంగా నచ్చని వారికి ఒక విధంగా చూస్తున్నారాణి అన్నారు.మహిళ కార్మికులను దూర ప్రదేశాలకు పంపిస్తున్నారు. వారి ఇష్టానుసారంగా చేస్తున్నారు. వారిపై చర్యలు తీసుకోవాలని, చనిపోయిన వారు 60 సంవత్సరాలు నిండిన వారు సుమారు 38 మందిని తీసివేశారు అని అన్నారు. వార్డులలో కార్మికులు లేక ఒక్కోళ్లే చేయవలసిన పరిస్థితి వస్తుందని ,ఆ కార్మికులను తీసుకుంటే వార్డుకు ఒక్కరిని ఇచ్చిన కనీసం ఒక్కొక్క వార్డ్ లో ఇద్దరి నుంచి ముగ్గురు వరకు ఈ పట్టణ ప్రజలకు సేవ చేయవచ్చు ఒక ట్రాక్టర్ పైన నలుగురు కార్మికులు ఇవ్వాలన్నారు. ఇద్దరినీ సరి చేయడం వలన కార్మికుల మీద పని భారం ఎక్కువ అవుతున్నదని అన్నారు. యధావిధిగా సానిటేషన్ సి ఆర్ ప్రకారం 271 మందిని యూనియన్ ద్వారా తీసుకోవాలన్నారు. వాటర్ వర్క్స్ లో పాత పద్ధతిలోనే లీవులు అమలు చేయాలన్నారు.
ఫిల్టర్ బెడ్ల వద్ద సంపుల వద్ద పనిచేసే కార్మికులకు 12 గంటలు కాకుండా ఎనిమిది గంటల పని దినాన్ని అమలు చేయాలి లేదా అధిక ఓవర్ టైం కట్టివ్వాలన్నారు.వాల్ ఆపరేటర్లకు బోరు చెడిపోయిన కాలిపోయిన స్పెషల్ ఆఫీసర్ ని పిలిపించుకొని ఫోటో దిగి ఆ ఫోటోను ఆపరేటర్ కడిగిపియ్యాలి. దీనివలన ఆపరేటర్కు 40 రూపాయలు చొప్పున ఖర్చు అవుతున్నాయి. ఫోటో విధానాన్ని తీసివేయాలి లేదా వార్డు ఆఫీసర్ కి బాధ్యత ఇవ్వాలన్నారు. వాటర్ వర్క్స్ మహిళా కార్మికులను శానిటేషన్ లో ఇద్దరు పని చేస్తున్నారు అని ఆరోపించారు. యధావిధిగా వాటర్ వర్క్స్ లో కి పంపించాలి డివైడర్ లో పార్కులో చేసే కార్మికులకు రక్షణ కల్పించాలన్నారు . దీనికి కమిషనర్ స్పందిస్తూ ఎవరికి లీవులు తగ్గించమని డ్యూటీలు మార్చమని బోర్ ఫోటోలను వాట్సప్లో పంపితే సరిపోతుందని చెప్పారు. కిందిస్థాయి అధికారులకు చెప్పి కార్మికుల సమస్యలు పరిష్కారం అయ్యే విధంగా చూడాలని వారికి తెలియజేయడం జరిగిందని అన్నారు. లేనియెడల ఆందోళన పోరాటాలకు పోతామని వారిని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు రాజనర్సు ,ఎండి మహబూబ్ అలీ ,జిల్లాప్రధాన కార్యదర్శి నాయకులు ఏ రాజు, ఎం కృష్ణ తదితరులు పాల్గొన్నారు.


