*గౌరారం గ్రామంలో అంగన్‌వాడీ భవనం నిర్మాణానికి భూమిపూజ – ఎమ్మెల్యే మదన్ మోహన్ …
 
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; అక్టోబర్ 25 (అఖండ భూమి న్యూస్);
గాంధారి మండలంలోని గౌరారం గ్రామంలో రూ.12 లక్షల వ్యయంతో నిర్మించబోయే అంగన్‌వాడీ భవనం నిర్మాణ పనుల ను శనివారం భూమి పూజ కార్యక్రమం నేడు ఎమ్మెల్యే మదన్ మోహన్ చేతుల మీదుగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు మాట్లాడుతూ, గ్రామీణ ప్రాంతాల్లో పిల్లల శ్రేయస్సు కోసం అంగన్‌వాడీ కేంద్రాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని, ఆధునిక సౌకర్యాలతో ఈ భవనం నిర్మాణం పూర్తయ్యాక గ్రామ ప్రజలకు ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు.
*పోథాంగల్ కళాన్ గ్రామంలో కొత్తగా నిర్మించిన గ్రామ పంచాయతీ భవనాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే మదన్ మోహన్ …
గాంధారి మండలంలోని పోథాంగల్ కళాన్ గ్రామంలో రూ.20 లక్షల వ్యయంతో నిర్మించిన గ్రామ పంచాయతీ భవనాన్ని ఎమ్మెల్యే మదన్ మోహన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ, గ్రామాభివృద్ధి కోసం ప్రభుత్వం కృషి చేస్తోందని, ప్రజల అవసరాలకు అనుగుణంగా మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టనున్నామని అన్నారు.
ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, గ్రామస్థులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.


