
కడుతులలో ఉచిత మెగా వైద్య శిబిరం
అల్లూరి జిల్లా: ముంచంగిపుట్టు మండలం(అఖండ భూమి) జూలై 30:గిరిజన గ్రామాలలో సీజనల్ వ్యాధులు ప్రబలుతున్న నేపథ్యంలో ముంచంగిపుట్టు మండలం కడుతుల గ్రామంలో ఆదివారం కిముడు రాంబాబు ఆధ్వర్యంలో పాడేరు సెంటెన్స్ హాస్పిటల్ వారి ద్వారా మెగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ మెగా వైద్య శిబిరంలో వివిధ రకాల సీజనల్ వ్యాధులతో బాధపడుతున్న 126 మంది రోగులకు సెంటెన్స్ హాస్పిటల్ వైద్యురాలు డాక్టర్ భార్గవి వైద్య సేవలు అందించారు. సీజనల్ వ్యాధులతో పాటు దీర్ఘకాల వ్యాధులు తో బాధపడుతున్న రోగులకు కూడా చికిత్స అందించారు. ఈ వైద్య శిబిరాన్ని ఉద్దేశించి రాంబాబు మాట్లాడుతూ.. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ముందస్తు చర్యగా పాడేరు సెంటెన్స్ హాస్పిటల్ వైద్యురాలు డాక్టర్ భార్గవి గారితో మాట్లాడి వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగిందని, ఈ వైద్య శిబిరానికి విశేష స్పందన లభించిందని అన్నారు. వైద్య శిబిరం ఏర్పాటు చేసిన పాడేరు సెంటెన్స్ హాస్పిటల్ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమానికి ఆశా కార్యకర్త శాంతమ్మ, వాలంటీర్ రాజేష్, చుట్టుపక్కల గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
You may also like
దత్తత గ్రామం అల్లిపూడి అభివృద్ధికి యనమల దివ్య భరోసా: సమస్యల పరిష్కారానికి హామీల జల్లు
రాజమహేంద్రవరం అభివృద్ధిపై శ్వేత పత్రం విడుదల చేయాలి
అంగరంగ వైభవంగా “మేడా” జన్మదిన వేడుకలు జరిగాయి …
రాజమండ్రిలో ఎనిమిదవ, బ్రాంచ్ ప్రారంభo
కుల నిర్మూలనకు, మహిళా సాధికారత కోసం పూలే సేవలు మరువలేనివి సున్నిపెంట గ్రామ అధ్యక్షుడు సుభాన్



