రండి తరలి రండి రజక గర్జన
రాష్ట్రంలో రజక సోదరీ సోదరీమణులందరికీ పిలుపునిస్తున్న
మన ఉనికిని ఈ రాజకీయ పార్టీలకు తెలిసి వచ్చే విధంగా చాటుదాం
బాపట్ల జిల్లా ఇంచార్జ్ జులై 30; (అఖండ భూమి)
రజక సంఘం గ్రూపులో ఉన్న సభ్యులందరికీ నమస్కారం అక్టోబర్ ఒకటో తేదీ ఆంధ్ర ప్రదేశ్ రజక సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో పాతపాటి అంజి బాబు అధ్యక్షతన రాష్ట్ర స్థాయి బహిరంగ సభ లక్ష మంది రజక ప్రతినిధులతో ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది ఇది ఒకరితో ఏ పని కాదు కాబట్టి మనం కులంలో జన్మించిన ప్రతి ఒక్కరు భాగస్వామ్యంతో రెండు వేల బస్సులు ఏర్పాటు చేయాలని కోరుకుంటున్న ఇటువంటి పరిస్థితుల్లో మీ జిల్లా నుంచి కూడా ఉద్యోగస్తులు వ్యాపారస్తులు మీ గ్రామంలో మీ మండలంలో మీ వంతు బాధ్యతగా రెండు లేదా మూడు బస్సులు ఏర్పాటు చేసుకుని సభకు వచ్చి రజకులు ఒక్క ఐక్యతను మన హక్కులను ఆత్మ గౌరవాన్ని మన సత్తాని చూపించి భావితరాలకు బంగారు బాట వేయాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాం మీ ఒక భాగస్వామ్యం అవసరం అన్నిపార్టీలు ఒకే సభ వేదిక మీద నాయకుల్ని తీసుకువచ్చి మన సమస్య కోసం పరిష్కారం చేసే ఏకైక మార్గం



