మృతుడి కుటుంబానికి పరామర్శించిన సబ్ రిజిస్ట్రార్ తస్లీమా.

 

 

మృతుడి కుటుంబానికి పరామర్శించిన సబ్ రిజిస్ట్రార్ తస్లీమా.

వెంకటాపూర్ ప్రతినిధి, అఖండ భూమి న్యూస్, జూలై 30.

నిరుపేద మృతుడి కుటుంబానికి సర్వర్ చారిటబుల్ ట్రస్ట్ & ఫౌండేషన్ వ్యవస్థాపకులు, సబ్ రిజిస్ట్రార్ తస్లీమా మహ్మద్ సహాయాన్ని అందించి సహృదయాన్ని చాటుకున్నారు.వెంకటాపూర్ మండలం లక్ష్మిందేవిపేట గ్రామానికి చెందిన కొండ మొగిలి ఇటీవలే అనారోగ్యంతో మరణించారు.విషయం తెలుసుకున్న తస్లీమా వెళ్ళి బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి,ఫోటోకి పూలతో నివాళులర్పించారు,

అతడి మరణం బాధాకరమని, మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు, ఇలాంటి సందర్భంలోనే ధైర్యంగా ఉండాలని కుటుంబ సభ్యులను తస్లీమా ఓదార్చారు,

సర్వర్ చారిటబుల్ ట్రస్టు & ఫౌండేషన్ ఆధ్వర్యంలో 50 కేజీల బియ్యంతో పాటు 2 వేల రూపాయలు అందించి సహృదయాన్ని చాటుకున్నారు,తస్లీమా వెంట సర్వర్ చారిటబుల్ ట్రస్టు & ఫౌండేషన్ సభ్యులు,గ్రామస్థులు, తదితరులు ఉన్నారు.

Akhand Bhoomi News

error: Content is protected !!