భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ పథకాలు అమలు చేయండి.. షేక్ పద్మ సిఐటియు నాయకురాలు..

 

భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ పథకాలు అమలు చేయండి..

షేక్ పద్మ సిఐటియు నాయకురాలు..

కోటనందూరు (అఖండ భూమి):

భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు పునరుద్దించి సంక్షేమ పథకాలు అమలు చేయాలని కోటనందూరు మండలంలో షేక్ పద్మ సిఐటియు నాయకురాలు ఆధ్వర్యంలో భవనిర్మాణ కార్మికులు తహసిల్దార్ కార్యాలయం వద్ద ధర్నా చేయడం జరిగింది. కోటనందూరు సిఐటియు మండల కార్యదర్శి షేక్ పద్మ మాట్లాడుతూ భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు పథకాలు పునరుద్దించాలని, సంక్షేమ బోర్డు సంక్షేమ పథకాలు అమలు కాకుండా రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మెమో నెంబర్ 1214 రద్దు చేయాలని, నాలుగు సంవత్సరాల నుంచి పెండింగ్లో ఉన్న పరిహారాలను కార్మికులకు తక్షణమే చెల్లించాలని, కరోనా కారణంగా చనిపోయిన భవన నిర్మాణ కార్మికుల కుటుంబాలకు 10 లక్షలు చెల్లించాలని , వైయస్సార్సీపి ప్రభుత్వం పక్కదారి పట్టించిన కార్మికుల సిస్ నిధులు 240 కోట్లు తిరిగి సంక్షేమ బోర్డుకు చెల్లించాలని డిమాండ్ చేశారు. అనంతరం తహసిల్దార్ కు వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో నూకరాజు, బొజ్జ, ఎం మాణిక్యం, పీ నాగేశ్వరావు, పీ శ్రీను,గడ్డం సమ్మయ, అప్పారావు, మల్ల కన్నబాబు, వేగీ రమణ, భూషణం ,ఈ సత్తిబాబు, నాగరాజు, కర్రీ సత్తిబాబు, తదితరులు పాల్గొన్నారు.

Akhand Bhoomi News

error: Content is protected !!