గిరిజన సమస్యలపై సీఎంకు విన్నవించిన పాడేరు శాసనసభ్యులు శ్రీమతి కొట్టగుల్లి భాగ్యలక్ష్మి
చెక్ డ్యాములు నిర్మించాలని వినతి
టిడిపి ప్రభుత్వంలో హౌసింగ్ పెండింగ్ బిల్లును విడుదల చేయాలని కోరిన భాగ్యలక్ష్మి
గిరిజన ప్రాంతానికి గృహ నిర్మాణ సౌకర్యం కల్పించాలని కోరిన ఎమ్మెల్యే
అల్లూరి జిల్లా గూడెం కొత్త వీధి అఖండ భూమి :
అల్లూరి సీతారామరాజు జిల్లాలో గిరిజనులు చిరకాలంగా ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాలని కోరుతూ మంగళవారం విశాఖలోని ఇనార్బిట్ మాల్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసేందుకు వచ్చిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి కి పాడేరు శాసనసభ్యులు శ్రీమతి కొట్టగుల్లి భాగ్యలక్ష్మి విన్నవించారు. ‘అల్లూరు’ జిల్లాలో మొదటి ఫేస్ లో గిరిజనులకు కొందరికి ఇళ్ల పట్టాల మంజూరు చేయడం జరిగిందని, రెండో పేస్ లో గృహ నిర్మాణాలకు ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. తెలుగుదేశం ప్రభుత్వంలో లబ్ధిదారులు ఇళ్ల నిర్మాణం చేపట్టినా ప్రభుత్వం నుంచి అందాల్సిన బిల్లులను మాత్రం పెండింగ్ లో ఉంచిందని బిల్లు మంజూరు చేసేందుకు కొందరికి రూ. 10,000 రూ.20,000 విడుదల చేసిందని మరికొందరికి కేవలం రూపాయి మాత్రమే అకౌంట్లో జమ చేసి వదిలేసిందని ఈ బిల్లును మంజూరు చేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఇందిరమ్మ గృహాలకు సంబంధించిన బిల్లులు కూడా పెండింగ్ లో ఉన్నాయని తెలిపారు.
“చెక్ డ్యాములు నిర్మించండి”
గిరిజన ప్రాంతంలో రైతులంతా పూర్తిగా వ్యవసాయ ఆధారిత సాగు మీద మాత్రమే ఆధారపడుతుంటారని ఈ దశలో నీటిని నిలువ చేసుకొని పంటల పండించే మార్గాలను ఏర్పాటుకు ప్రభుత్వం కృషి చేయాలని కోరారు. పాడేరు నియోజకవర్గంలో కొన్ని చెక్ డ్యామ్ లో నిర్మాణం జరిగితే ఒక్కొక్క చెక్ డాం పరిధిలో సుమారుగా 500 ఎకరాలకు పైగా రెండు పంటలు వేసుకునే అవకాశం ఏర్పడుతుందని ముఖ్యమంత్రివర్యులు వైయస్ జగన్మోహన్ రెడ్డి కి ఎమ్మెల్యే కె భాగ్యలక్ష్మి వివరించడం జరిగింది. చింతపల్లి మండలంలోని తాజంగి, కొమ్మంగి దగ్గర రవిరింతాడ, పులిగొంది, పెదబరడ, అంజలి శనివారం వద్ద నూతన చెక్ డ్యాములు (రిజర్వాయర్లు) నిర్మించాలని ముఖ్యమంత్రిని కోరారు. ఈ చెక్ డ్యామ్ ల నిర్మాణం చేపడితే సుమారుగా 2500 నుంచి 3000 ఎకరాలకు పైబడి భూములు సాగులోకి వచ్చే అవకాశం ఉందని భాగ్యలక్ష్మి సీఎంకు వివరించారు. వర్షాధారంపై పంటల పండిస్తున్న రైతులు ఇకనుంచి ఏటా రెండేసి పంటలు పండించేందుకు అవకాశం ఏర్పడుతుందని పేర్కొన్నారు. వీటికి సంబంధించిన రూ. 4.50 కోట్లతో కూడిన ప్రతిపాదనను కూడా ముఖ్యమంత్రి అందించారు. నూతన చెక్ డ్యాముల నిర్మాణంతో పాటు ప్రస్తుతం మరమ్మతులో ఉన్న చెక్ డాములు కూడా రిపేర్లు పూర్తి చేయాలని సందర్భంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ని ఎమ్మెల్యే కె భాగ్యలక్ష్మి కోరారు



