ఆపరేషన్ పరివర్తన కార్యక్రమంలో భాగంగా మారుమూల గ్రామాలకు కమల మొక్కల పంపిణీ సీఐ అశోక్ కుమార్
అల్లూరి జిల్లా గూడెం కొత్త వీధి (అఖండ భూమి) ఆపరేషన్ పరివర్తన కార్యక్రమంలో బాగంగా ఈరోజు గంజాయి నిర్మూలనకు సహకరించిన మారుమూల ప్రాంత గిరిజనులకు పోలీసు శాఖ ఆధ్వర్యంలో గంజాయి తోటలను ధ్వంసం చేసి వారికి ప్రత్యణమయ పంటలకు ఇవ్వడం కోసం సుమారు 1045 ఎకరాల పండ్ల మొక్కలను (202 3 )ఈ సంవత్సరం గూడెం కొత్త వీధి మండలంకు మంజూరు చేయడం జరిగింది. దీనిలో భాగంగా మంగళవారం గూడెం కొత్త వీధి సీఐ అశోక్ కుమార్ ఆధ్వర్యంలో 360 ఎకరాలకు గాను స్వీట్ ఆరంజ్ మొక్కలను మండల కేంద్రంలో పంపిణీ చేయడం జరిగింది గుడం కొత్త వీధి మండలంలోని జీకే మీద పంచాయతీ మారుమూల గ్రామాలైన వాడమామిడి, చిన్న అగ్రహారం, పెద్ద అగ్రహారం, కోతి గొండి, నిమ్మపాలెం, పాము రాయి తదితర గ్రామాలకు మొక్కల పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో గూడెం కొత్త వీధి సర్కిల్ ఇన్స్పెక్టర్ జి. అశోక్ కుమార్ , ఎంపీడీవో పి. ఉమ మహేశ్వర రావు , ఎస్సై కే. అప్పల సూరి జాతీయ ఉపాధి హామీ పథకం ఏపీవో రామ్ ప్రసాద్ , వి ఏ ఏ లు మహిళ పోలీస్ లు, వి ఆర్ పి లు మరియు గ్రామస్తులు పాల్గొన్నారు.
You may also like
రాజ్యాధికారం సాధన ద్వారా నే దళిత బహుజన కులాల కు విముక్తి ; దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షులు వడ్లమూరి. కృష్ణ స్వరూప్
విద్యార్థులకు సైబర్ నేరాలపై బాల్య వివాహాలపై అవగాహన
లోకోస్ పై వీఓఏల శిక్షణ కార్యక్రమం
న్యాయవాద వృత్తిలో యువతకు భరోసా కల్పించండి: కలెక్టర్కు వినతిపత్రం అందజేసిన విశాఖపట్నం బార్ అసోసియేషన్.
రాష్ట్రంలో విద్య దోపిడి భయంకరంగా ఉన్నది,



