జిల్లావ్యాప్తంగా విద్యుత్తు అంతరాయాలు.. 

 

జిల్లావ్యాప్తంగా విద్యుత్తు అంతరాయాలు..

ఇబ్బందులు పడుతున్న ప్రజలు…

అకస్మాత్తుగా తీసుకున్న నిర్ణయాలను తప్పుపడుతున్న ప్రజానీకం…

కర్నూలు / వెల్దుర్తి ఆగస్టు 08 అఖండ భూమి వెబ్ న్యూస్ : విద్యుత్ అధికారులు తీసుకున్న నిర్ణయాలను తప్పుపడుతున్న ప్రజానీకం. ఉన్నట్టుండి సడన్గా నిర్ణయాలు తీసుకోవడం ఎంతవరకు సబబు అని ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వంపై పోరాటాలు సడన్ నిర్ణయం తీసుకుంటే బాధ్యత ఎవరు తీసుకుంటారు అన్నదే ప్రశ్నార్థకంగా మారింది. ప్రజానికం ఏమైపోయినా పరవాలేదు మా డిమాండ్లు ప్రభుత్వం తక్షణమే చెల్లించాలన్న కోణంలో నిర్ణయాలు తీసుకోవడం సరైన పద్ధతి కాదని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అసలే దోమల కాలం విద్యుత్ సరఫరా లేక చిన్నాచితక, పేద మద్దతురగతి వారి నుండి ఇబ్బందులు పడుతున్న వైనం మంగళవారం రాత్రి చవిచూసింది. తక్షణ నిర్ణయాలు తీసుకుని ప్రజలను ఇబ్బంది పెడితే ప్రభుత్వం వెంటనే స్పందిస్తుందా అన్న కోణంలో పరిశీలకులు భావిస్తున్నారు. ముందస్తు సమాచారం ఇచ్చి నిరసన నిర్ణయాలు తీసుకుంటే బాగుండేది అని అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. రాత్రి వేళలో నిద్ర లేక అప్పుడే పుట్టిన బిడ్డ నుండి పండు ముద్దు సారి వరకు ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలను ప్రజలపై రుద్దడం సరైనది కాదని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. విద్యుత్ అధికారుల డిమాండ్లు 2014 నుండి ఐదు సంవత్సరాలు సీనియార్టీ ఉన్న వారిని రెగ్యులర్ చేయాలని, కాంట్రాక్టు బేసిక్ ఉన్న వారిని కూడా పర్మనెంట్ చేయాలని, ఈపీఎఫ్ నుండి జిపిఎఫ్ కి తీసుకురావాలని, మరికొన్ని ప్రధాన సమస్యల పైన దాదాపు 15 రోజులుగా ధర్నా చేస్తున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం ఎముక నేరెక్కినట్టుగా వ్యవహరించడంతో మండల స్థాయి నుండి జిల్లా స్థాయి వరకు రెండు గంటలు విద్యుత్తుకు అంతరాయం కలిగించే నిరసన తెలియజేయడం జరిగింది. ఈ నిరసన కార్యక్రమానికి మద్దతుగా విద్యుత్తు అంతరాయం కలిగించడం జరిగినట్లు విశ్వనేత సమాచారం.

Akhand Bhoomi News

error: Content is protected !!