గంజాయి, సారా అక్రమ రవాణా కు పాల్పడితే కేసులు తప్పవు. ఎక్సైజ్ స్వర్కిల్ ఇన్స్పెక్టర్ వై రాజు

 

 

గంజాయి, సారా అక్రమ రవాణా కు పాల్పడితే కేసులు తప్పవు.

ఎక్సైజ్ స్వర్కిల్ ఇన్స్పెక్టర్ వై రాజు

కొయ్యూరు అఖండ భూమి

ఆగస్టు ఎనిమిది అల్లూరి జిల్లా

ఏజెన్సీ ప్రాంతం నుండి గంజాయి, సారా అక్రమ రవాణా కు పాల్పడిన, విక్రయాలు సాగించిన ఎంతటి వారైనా అరెస్టు చేసి కేసులు నమోదు చేయటం తప్పదని చింతపల్లి ఎక్సైజ్

 

సర్కిల్ ఇన్స్పెక్టర్ వై. రాజు అన్నారు. అల్లూరి జిల్లా కొయ్యూరు మండలం నడింపాలెం సెంటర్ లో మంగళవారం సి ఐ ఆధ్వర్యంలో ఆయా ప్రాంత గిరిజన యూత్ తో సారా, గంజాయి నివారణ కై యూత్ ముందుకు రావాలని, చట్ట పరమైన చర్యలకు దూరంగా ఉండాలని కోరుతూ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్బంగా సి ఐ మాట్లాడుతూ గిరిజన గ్రామాల్లో కొంతకాలంగా సాగుతున్న గంజాయి, సారా రవాణా పై ప్రభుత్వం అమలు చేసిన ప్రత్యేక చట్టాలు, శిక్షలు తో ఎవరైనా పొరపాటున అరెస్టు అయితే జీవితాంతం అనుభవవించటమే కాక లక్షలు రూపాయలు జరిమానా విధించట తప్పదన్నారు. చదువుకున్న నిరుద్యోగ యువత చెడు మార్గంలో నడిచే కన్నా ఉద్యోగ, ఉఫాది అవకాశాలు కల్పించుకుని బంగారు భవిష్యత్ పొందాలని ఆయన సూచించారు. ఇప్పటికైనా గ్రామాల్లో గంజాయి రవాణా కు వెళ్లే వారు, సారా తయారీ చేసే వారంతా అలాంటి సంఘ వ్యతిరేకం కార్యకలాపాలు, విక్రయాలకు దూరంగా ఉండాలని సి ఐ రాజు తెలిపారు. ఈ ర్యాలీ లో ఆయా ప్రాంత పెద్దలు, యూత్ పాల్గొన్నారు.

Akhand Bhoomi News

error: Content is protected !!