అవిశ్వాస తీర్మానంపై నేడు రాహుల్‌ ప్రసంగం..!

 

 

అవిశ్వాస తీర్మానంపై నేడు రాహుల్‌ ప్రసంగం..!

కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా లోక్‌సభలో విపక్షాల కూటమి(I.N.D.I.A.) ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం(No-Confidence motion)పై బుధవారం కాంగ్రెస్‌ పార్టీలోని కీలక నేతలు ప్రసంగించనున్నారు.

 

నేడు పార్టీ తరఫున గళం విప్పేందుకు రాహుల్‌ గాంధీ(Rahul Gandhi), రేవంత్‌ రెడ్డి, హిబి ఇడన్‌ పేర్లను పంపినట్లు పార్టీకి చెందిన మాణికం ఠాగూర్ పేర్కొన్నారు. పరిస్థితులను బట్టి ప్రసంగాల క్రమంలో మార్పులు ఉండొచ్చని వెల్లడించారు. రాహుల్‌ లోక్‌సభ సభ్యత్వాన్ని పునరుద్ధరించిన తర్వాత ఆయన పార్లమెంట్‌లో తొలిసారి ప్రసంగించనున్నారు. దీంతో ప్రభుత్వాన్ని ఆయన ఏవిధంగా ఇరుకున పెడతారనేది సర్వత్రా ఆసక్తిగా మారింది. వాస్తవానికి రాహుల్‌ నిన్ననే ప్రసంగిస్తారని ప్రచారం జరిగినా.. అది వాయిదాపడింది..

Akhand Bhoomi News

error: Content is protected !!