రాజధానిలో స్థానికేతరులకు ఇళ్ల స్థలాలు.. పిటిషన్లపై హైకోర్టు విచారణ..
అమరావతి: ఆర్-5 జోన్‌లో స్థానికేతరులకు ఇళ్ల స్థలాల కేటాయించిపునకు రాష్ట్ర ప్రభుత్వం జారీచేసిన జీవోను సవాల్ చేస్తూ రైతులు దాఖలు చేసిన పిటిషన్లపై హైకోర్టులో విచారణ జరిగింది..రాజధాని పరిధిలో టిడ్కో ఇళ్లను లబ్ధిదారులకు అందజేయకుండా ఇళ్ల పట్టాల పంపిణీపై ప్రభుత్వానికి తొందర ఎందుకని పిటిషనర్లు ప్రశ్నించారు. దీనిపై హైకోర్టు స్పందిస్తూ టిడ్కో ఇళ్లపై ప్రభుత్వం, పిటిషనర్లు ఎలాంటి వివరాలు ఇవ్వలేదని పేర్కొంది. రాజధాని ప్రాంతంలో నిర్మించిన 5వేల టిడ్కో ఇళ్ల లబ్ధిదారుల వివరాలు, ఇళ్ల మంజూరుకు అనుసరించిన విధివిధానాలను పూర్తి వివరాలతో అందజేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. అనంతరం తదుపరి విచారణను ఉన్నత న్యాయస్థానం రేపటికి వాయిదా వేసింది..



