అక్రమ అరెస్టులను ఖండించండి
డి రవి, PYL జిల్లా ప్రధాన కార్యదర్శి
అఖండ భూమి సూర్యాపేట జిల్లా మునగాల.
నిరుద్యోగ సమస్యలపై పోరాడుతున్న ప్రగతిశీల యువజన సంఘం(పీవైఎల్) జిల్లా ప్రధాన కార్యదర్శి, జిల్లా అధ్యక్షుడు, జిల్లా నాయకులను ముందస్తు అక్రమ అరెస్ట్ చేయడం సిగ్గుమాలిన చర్య అని పివైఎల్ జిల్లా ప్రధాన కార్యదర్శి డి రవి అన్నారు. ఈ సందర్భంగా పివైఎల్ జిల్లా ప్రధాన కార్యదర్శి దరవత్ రవి మాట్లాడుతూ కెసిఆర్ ప్రభుత్వంకు మద్యం టెండర్ల పై ఉన్న ప్రేమ నిరుద్యోగులపై లేదని అన్నారు. ఇంకా రెండు నెలలు గడువు ఉండగానే ముందే మద్యం టెండర్లు పిలిచి ఆదాయాన్ని సొమ్ము చేసుకోవడం కోసం ఈ ప్రభుత్వం చేస్తున్న కుయుక్తులు నిరుద్యోగులపై ఎందుకు లేదని వారు ప్రశ్నించారు. నిరుద్యోగ సమస్యలు పరిష్కరించకుండా కాలయాపన చేస్తూ కెసిఆర్ ప్రభుత్వాన్ని ఓడించడానికి యువకులు, నిరుద్యోగులు ఐక్యం కావాలని పిలుపునిచ్చారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్వహిస్తున్న బహిరంగ సభలో కెసిఆర్ ను ప్రశ్నించడానికి వెళ్తున్న పివైఎల్ నాయకులను అక్రమంగా అరెస్టు చేయడం సిగ్గుచేటని అన్నారు. ప్రశ్నించే హక్కులను ముందస్తు అరెస్టులు పేరుతో నిర్బంధించడం సరైనది కాదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. అక్రమ అరెస్టులతో ఉద్యమాల్ని ఆపలేరని వారన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుండి నేటి వరకు కనీసం 50000 ఉద్యోగాలు కూడా భర్తీ చేయకుండా నిరుద్యోగులను బీఆర్ఎస్ ప్రభుత్వం మోసం చేస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. నిరుద్యోగ భృతి ఇస్తానని చెప్పినటువంటి కేసీఆర్ ప్రభుత్వం నేటి వరకు దాని ఊసే లేదని అన్నారు. ఎక్కడ సభ జరిగిన ఒకటే మాట ఒకటే పాటగా ఉపన్యాసం ఇస్తున్నారు తప్ప ఆచరణ మాత్రం సాధ్యం కావడం లేదని వాపోయారు. ఖాళీగా ఉన్న అన్ని రకాల పోస్టులు భర్తీ చేయకపోతే ఉద్యమాలను ఉదృతం చేస్తామని వారు హెచ్చరించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం చేయిస్తున్న అక్రమ అరెస్టులను ప్రజలు, ప్రజాస్వామిక వాదులు, యువకులు, నిరుద్యోగులు ఖండించాలని పిలుపునిచ్చారు.
You may also like
జిల్లాలో బతుకమ్మ ఉత్సవాలను వైభవంగా నిర్వహించాలి కలెక్టర్ ఆదేశాలు జారీ…
సీఐటీయూ ఆధ్వర్యంలో డిపిఓ జిల్లా పంచాయతీ అధికారి కార్యాలయాన్ని ముట్టడించిన గ్రామపంచాయతీ కార్మికులు
ఎల్లారెడ్డి పట్టణంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభం…
మద్యం సేవించిన 29 మందికి జైలు శిక్ష జరిమానాలు…
దళిత మహిళ అటెండర్ పై కుల వివక్షత చూపిన తహసిల్దార్ ను వెంటనే సస్పెండ్ చేయాలి…