సంస్కృతి, సంప్రదాయాలకు బోనాల పండుగ ప్రతీతి

 

సంస్కృతి, సంప్రదాయాలకు బోనాల పండుగ ప్రతీతి

గ్రామ దేవతలను ఆరాదించిడం శతాబ్దాల ఆనవాయితీ

పట్టణ ప్రజాలపై ఊర ముత్యాలమ్మ కరుణ చూపాలి

అఖండ భూమి సూర్యాపేట జిల్లా కోదాడ.

గ్రామ దేవతలను ఆరాధించడం తెలంగాణ ప్రజల ఆచారాల్లో ప్రధానమైన అంశమని *కోదాడ శాసనసభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్ అన్నారు. ఆదివారం కోదాడ పట్టణంలో బోనాల పండుగ సందర్భంగా ముత్యాలమ్మ గుడి లో ఆయన ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయ కమిటీ సభ్యులు ఎమ్మెల్యే ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…….. పూర్వకాలం నుండి గ్రామదేవతలు ప్రజలను, పశు,పక్షాదులను పాడిపంటలను మహమ్మారం నుండి కాపాడుతాయని గొప్పగా విశ్వసిస్తారని తెలిపారు. ముత్యాలమ్మ తల్లి దయతో పాడిపంటలు కలగాలని పశుపక్షాదులు ప్రజలు ఆయురారోగ్యాలతో ఉండాలని అమ్మవారిని ఆకాంక్షించినట్లు తెలిపారు. గ్రామాలను సుభిక్షంగా ఉండేటట్లు గ్రామదేవతలు కాపాడుతారనే నమ్మకంతో గ్రామ పొలిమేరలో గ్రామదేవతలను నాటి సమాజం ఏర్పాటు చేసుకున్నారని ఆ విశ్వాసంతోనే నేడు సమాజం సుఖ సంతోషాలతో ఉందన్నారు . ఆ రోజుల్లో మసూచి, కుష్టు వ్యాధులు ఇతర భయంకరమైన చర్మ సంబంధ వ్యాధులతో జనం చనిపోతుంటే ప్రజలు స్థానిక అమ్మవారిని మొక్కడంతో వ్యాధులు అంతరించిపోయి ప్రజలు ఆరోగ్యాలతో ఉన్నారని తెలిపారు.తెలంగాణ ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత సీఎం కేసీఆర్ గ్రామ దేవతల ఉత్సవాలకు పెద్దపీట వేశారన్నారు స్థానికంగా ఉన్న ఆలయాలకు నిధులు మంజూరు చేసి అభివృద్ధి చేశారన్నారు ప్రభుత్వం ప్రజల విశ్వాసాలలో భాగస్వామ్యమై పండుగల కు ఆదరణ పెంచిందన్నారు పట్టణ ప్రజలకు ముత్యాలమ్మ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, పట్టణం బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

Akhand Bhoomi News

error: Content is protected !!