విజయవంతంగా తలసేమియా మెగా రక్తదాన శిబిరం ..

 

 

విజయవంతంగా తలసేమియా మెగా రక్తదాన శిబిరం ..

రక్తదానం అందించిన 100 మంది దాతలు…

రక్తదానం చేసి ప్రాణదాతలుగా నిలవడం అభినందనీయ

అఖండ భూమి సూర్యాపేట జిల్లా కోదాడ.

రక్తదానం ప్రాణదానంతో సమానంగా భావించి కోదాడ ఎలక్ట్రానిక్ మీడియా అసోసియేషన్ ఆధ్వర్యంలో సూర్యాపేట జిల్లా ప్రెస్ క్లబ్ అధ్యక్షులు కారింగుల అంజన్ గౌడ్ జన్మదినం సందర్భంగా కోదాడ ప్రభుత్వ హాస్పిటల్ లో ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో రోగులకు ఫ్రూట్స్ బ్రెడ్లు పంపిణీ చేశారు. మదర్ తెరిసా యూత్ ఆధ్వర్యంలో ఘనంగా జన్మదిన వేడుకలు నిర్వహించారు.అనంతరం బాలుర ఉన్నత పాఠశాలలో ఏర్పాటుచేసిన రక్తదాన శిబిరానికి రక్తం దానం చేసేందుకు యువత కదంతొక్కారు.యువత గుంపులు గుంపులుగా వచ్చి రక్త దానాలు చేసి ఎలక్ట్రానిక్ మీడియా అసోసియేషన్ కు వన్నె తెచ్చారు.ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షులు పడిశాల రఘు అధ్యక్షతన,మీడియా అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు అయిన రక్తదాన శిబిర ప్రారంభోత్సవంలో ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ ముఖ్య అతిథులుగా పాల్గొని రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు.రక్తదానం చేసే ప్రతి ఒక్కరి వద్దకు వెళ్లి మంచి కార్యక్రమానికి కదలి వచ్చినందుకు అభినందనలు తెలిపారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ …జర్నలిస్టులు ప్రభుత్వానికి ప్రజలకు వారదులుగా ఉంటూ సమాజాన్ని చైతన్య పరచడమే కాక సమాజసేవలో భాగస్వాములు కావడం అభినందనీయమన్నారు.ఎంతో భవిష్యత్తు ఉన్న చిన్నారులు తల సేమియా వ్యాధితో బాధపడుతూ చికిత్సకు రక్తం అందక ఎంతోమంది కన్నుమూస్తున్నారని వారిని ఆదుకునేందుకు కోదాడ ఎలక్ట్రానిక్ మీడియా అసోసియేషన్ చేపట్టిన రక్తదాన శిబిరం మహోన్నతమైనది అన్నారు. కోదాడ జర్నలిస్టులను ఏకతాటిపై నడిపిస్తూ వృత్తి గౌరవాన్ని పెంచుతూ సమాజ శ్రేయస్సు కోసం పలు సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్న అంజన్ గౌడ్ ను వారు అభినందించారు. కత్తిమీద సాము వంటి జర్నలిజం ఎంచుకొని కుటుంబ జీవితాలను త్యాగం చేస్తూ ఎందరో జర్నలిస్టులు అక్రమాలను అవినీతిని వెలుగులోకి తెచ్చి అరికట్టడంతో పాటు ఎంతోమంది ప్రజల కష్టసుఖాలను సమాజానికి తెలియచేస్తున్న సేవలు చిరస్మరణీయమన్నారు.ఈ సందర్భంగా సిటీ హాస్పటల్లో ఏర్పాటు చేసిన జన్మదిన వేడుకలలో అంజన్ గౌడ్ పాల్గొని కేక్ కట్ చేశారు.అనంతరం ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా ఆధ్వర్యంలో పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కోదాడ డిఎస్పి ప్రకాష్, టిడబ్ల్యూజే జిల్లా అధ్యక్షులు ఒజ్జా వీరయ్య, హరి కిషన్, కొత్తపల్లి సురేష్, సోంపంగు గణేష్ వంగవీటి శ్రీనివాసరావు, పూర్ణచంద్రరావు,వెంకట్ నారాయణ, పిడమర్తి గాంధి మతంగి సురేష్, కోట రాంబాబు, సైదులు,నాగరాజు, సురేష్, శ్రీకాంత్, గోపాల్, నజీర్, మహమూద్,

Akhand Bhoomi News

error: Content is protected !!