ఎమ్మెల్యేకు బ్రహ్మరథం పడుతున్న ప్రజలు…
వెల్దుర్తి ఆగస్టు 30 (అఖండ భూమి) : మండల పరిధిలోని
లక్ష్మీనగరం గ్రామంలో పత్తికొండ నియోజకవర్గం ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవమ్మకు గ్రామ ప్రజలు బ్రహ్మరథం పట్టారు. మండల సచివాలయాల కన్వీనర్ దేశాయ్ సమీర్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా గడపగడపకు మన ప్రభుత్వం అనే కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రభుత్వ పథకాలు ప్రజల చెంతకు చేరాయా లేదా అని అడిగి తెలుసుకున్నారు. జగన్ ప్రభుత్వం చేసిన సంక్షేమ పథకాలు ప్రజలకు ఉపయోగకరంగా ఉన్నాయని పేర్కొన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పేద ప్రజల గుండెలలో కొలువై ఉన్నాడని తెలిపారు. రానున్న 2024 ఎన్నికలలో జగన్ ప్రభుత్వాన్ని ఆశీర్వదించి పత్తికొండ ఎమ్మెల్యేగా గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల జడ్పిటిసి దాది పోగు సుంకన్న వైఎస్ఆర్సిపి కార్యకర్తలు అధికారులు ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
You may also like
దత్తత గ్రామం అల్లిపూడి అభివృద్ధికి యనమల దివ్య భరోసా: సమస్యల పరిష్కారానికి హామీల జల్లు
రాజమహేంద్రవరం అభివృద్ధిపై శ్వేత పత్రం విడుదల చేయాలి
అంగరంగ వైభవంగా “మేడా” జన్మదిన వేడుకలు జరిగాయి …
రాజమండ్రిలో ఎనిమిదవ, బ్రాంచ్ ప్రారంభo
కుల నిర్మూలనకు, మహిళా సాధికారత కోసం పూలే సేవలు మరువలేనివి సున్నిపెంట గ్రామ అధ్యక్షుడు సుభాన్



