పార్లమెంట్ గాంధీ విగ్రహం వద్ద తెదేపా ఎంపీలు, మాజీ ఎంపీల నిరసన
దిల్లీ: తెదేపా అధినేత చంద్రబాబు అరెస్ట్‌ను ఖండిస్తూ పార్లమెంట్ ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద ఆ పార్టీ ఎంపీలు, మాజీ ఎంపీలు నిరసన తెలిపారు. ‘సేవ్ ఆంధ్రప్రదేశ్’, ‘వియ్ వాంట్ జస్టిస్’ అంటూ నినాదాలు చేశారు..
ఈ నిరసన కార్యక్రమానికి తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ హాజరయ్యారు.
లోకేశ్‌తో పాటు ఎంపీలు రామ్మోహన్‌నాయుడు, గల్లా జయదేవ్, కేశినేని నాని, కనకమేడల రవీంద్రకుమార్, వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు.. తెదేపా మాజీ ఎంపీలు అయ్యన్నపాత్రుడు, కళా వెంకట్రావు, గంటా శ్రీనివాసరావు, కాలవ శ్రీనివాసులు, మురళీమోహన్, కంభంపాటి రామ్మోహన్‌రావు, నిమ్మల కిష్టప్ప, కొనకళ్ల నారాయణ, బీకే పార్థసారథి తదితరులు పాల్గొన్నారు.
You may also like
రాజ్యాధికారం సాధన ద్వారా నే దళిత బహుజన కులాల కు విముక్తి ; దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షులు వడ్లమూరి. కృష్ణ స్వరూప్
విద్యార్థులకు సైబర్ నేరాలపై బాల్య వివాహాలపై అవగాహన
లోకోస్ పై వీఓఏల శిక్షణ కార్యక్రమం
న్యాయవాద వృత్తిలో యువతకు భరోసా కల్పించండి: కలెక్టర్‌కు వినతిపత్రం అందజేసిన విశాఖపట్నం బార్ అసోసియేషన్.
రాష్ట్రంలో విద్య దోపిడి భయంకరంగా ఉన్నది,



