హీరో విజయ్ ఆంటోని ఇంట తీవ్ర విషాదం

 

 

హీరో విజయ్ ఆంటోని ఇంట తీవ్ర విషాదం

నేటి (మంగళవారం) తెల్లవారుజామున మూడు గంటలకు తన గదిలోని సీలింగ్ ఫ్యాన్‌కు ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. అయితే ఆమె ఆత్మహత్యకు చదువుల ఒత్తిడే కారణమని భావిస్తున్నారు.

విజయ్ ఆంటోని ఫాతిమా దంపతులకు మీరా ఒక్కతే సంతానం. విజయ్ కుటుంబం చెన్నైలోని డీడీకే రోడ్డులో నివాసం ఉంటోంది. ఆ ఒక్క పాప కూడా ఆత్మహత్యకు పాల్పడంతో విజయ్ ఆంటోని కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. మీరా మృతికి గల అసలు కారణాలు తెలియాల్సి ఉంది. ఇప్పటి వరకూ విజయ్ ఆంటోని అయితే తన కూతురి మృతిపై స్పందించలేదు. కాగా.. విజయ్ ఆంటోని కూతురి మరణ వార్త తెలుసుకున్న సినీ ప్రముఖులు, అభిమానులు ఆయనకు సోషల్ మీడియా వేదికగా ధైర్యం చెబుతున్నారు. మీరా మృతి పట్ల సంతాపం వ్యక్తం చేస్తున్నారు..

Akhand Bhoomi News

error: Content is protected !!