నర్సీపట్నం నియోజకవర్గం జనసేన పార్టీ నియోజక వర్గ ఇన్చార్జ్ రాజాన సూర్య చంద్ర అర్ధరాత్రి 11:30 నిమిషాల సమయంలో నాతవరం లోని తన నివాసంలో నిద్రిస్తుండగా అక్రమ ఇసుక రవాణా, శిధిలమైన రోడ్ల సమస్యలపై అసెంబ్లీ ముట్టడి ప్లాన్అనుమానం తో పోలీసులు ముందస్తు అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కి తరలించారు ఈ విషయమై సూర్యచంద్ర మాట్లాడుతూ ఈ చర్యలు నియంతృత్వ పాలనకు సూచనా ప్రాయంగా ఉన్నాయని ఇలాంటి అరెస్ట్ లు తమ రాజ్యాంగ హక్కులను కాలరాస్తూ హరించడమేనని ఆయన అన్నారు ఆంధ్ర ప్రదేశ్ లో భారత రాజ్యాంగ హక్కులను ఉల్లంఘిస్తూ పరిపాలన సాగిస్తున్నారని ఆర్టికల్ 19 (1)ఎ మరియు 19 (1)సి లో పేర్కొన్న హక్కులను పూర్తిగా హరిస్తూ పాలన చేస్తున్నారని ప్రజా స్వామ్యం లో ఇలాంటి చర్యలు రాష్ట్రానికే కాక యావత్ దేశానికే ప్రమాదమని ఆయన ధ్వజమెత్తారు జనసేన పార్టీ నాయకునిగా ప్రజా సమస్యలపట్ల గళమెత్తి సమస్యలను వెలుగులోకి తీసుకువచ్చి వాటి పరిష్కారమార్గం చూపించమని అధికార పార్టీ పాలకుల ముందు ఉంచితే పరిష్కారం చూపించక పోగా అరెస్ట్ లతో సమస్యలపై గొంతెత్తకుండా నియంతలా నాయకుల గొంతులను నొక్కే ప్రయత్నం చేస్తున్నారని ఈ చర్యల వల్ల సామాన్య ప్రజలు భయ భ్రాంతులకు లోనౌతున్నారని ఆయన అన్నారు ఈ పాలన ప్రజలకు బ్రిటిష్ పాలనను తలపిస్తుందని ఆయన అన్నారు ఈ పాలన పట్ల ప్రజలు విసిగిపోయి ఎన్నికలు ఎప్పుడొస్తాయా అని ఎదురు చూస్తున్నారని ఈసారి ప్రజల తీర్పులో వైసీపీ కొట్టుకుపోవడం ఖాయమని ఆయన హెచ్చరించారు

ANDHRA BREAKING NEWS HEALTH NEWS PAPER STATE

