జర్నలిజంలో ప్రతిభకు పురస్కారాలు…

మంగళగిరికి మూడు పురస్కారాలు.

భారత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, సీబీఐ మాజీ జేడీ లక్ష్మీ నారాయణ, ప్రెస్ అకాడమీ ఛైర్మన్ కొమ్మినేని శ్రీనివాసరావు చేతుల మీదుగా ప్రతిభా పురస్కారాలు అందుకున్న జర్నలిస్టులు.

మంగళగిరి ( అఖండ భూమి ) : –

ఇటీవల ఉత్తమ జర్నలిస్ట్ ఉగాది పురస్కారాలకు రెండు తెలుగు రాష్ట్రాల పరిధిలో మంగళగిరి నుండి ఇద్దరు సీనియర్ జర్నలిస్ట్ లు ఎంపిక కాగా…సోషల్ మీడియా విభాగంలో రెండు తెలుగు రాష్ట్రాలలో మంగళగిరికి నగర పరిధికి చెందిన వ్యక్తి ఆద్వర్యంలో నడుస్తున్న తెలుగు న్యూస్ వెబ్సైటు ని ఉగాది పురస్కారం వరించిన విషయం విదితమే. ఈ నేపధ్యంలో మంగళవారం గుంటూరులో జరిగిన కార్యక్రమంలో భారత మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ, ప్రెస్ అకాడమీ ఛైర్మన్ కొమ్మినేని శ్రీనివాసరావు చేతుల మీదుగా ప్రతిభా పురస్కారాలను అందుకున్నారు.సామాజిక స్పృహ, భాద్యత,భద్రత విభాగం లో మంగళగిరి నగర పరిధి నవులూరు మక్కేవారిపేటకు చెందిన సీనియర్ జర్నలిస్ట్ ఈపూరి రాజారత్నం, జంతుసంరక్షణ- బాలకార్మిక నిర్మూలనా విభాగం లో మంగళగిరికి చెందిన మరో సీనియర్ జర్నలిస్ట్, ఐబీఎన్ భవన్ ప్రెస్ క్లబ్ ప్రధాన కార్యదర్శి బందెల దయాకర్, తెలుగు న్యూస్ వెబ్సైట్(సోషల్ మీడియా విభాగం) లో మంగళగిరి నగర పరిధి యర్రబాలెం కు చెందిన ఏనేపల్లి శ్రీనివాసరావు (వాసు) లు ప్రతిభా పురస్కారాన్ని అందుకున్నారు. ప్రతిభా పురస్కారాలు అందుకున్న వారికి పలువురు అభినందనలు తెలిపారు.

 

Akhand Bhoomi News

error: Content is protected !!