నేడు ఢిల్లీ కు సీఎం కేసీఆర్*హైదరాబాద్, దిల్లీ: దిల్లీలోని వసంత్ విహార్‌లో నిర్మిస్తున్న భారాస కేంద్ర కార్యాలయాన్ని (తెలంగాణ భవన్) ఈ నెల 4న ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించనున్నారు. ఈ మేరకు మంగళవారం సాయంత్రం లేదా బుధవారం ఉదయం దిల్లీకి ఆయన వెళ్లే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. 20 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో.. నాలుగు అంతస్తులుగా భవనాన్ని నిర్మించారు. సోమవారం సాయంత్రమే మంత్రి ప్రశాంత్‌రెడ్డి, ఎంపీ జోగినపల్లి సంతోష్‌కుమార్ దిల్లీకి పయనమయ్యారు. ‘దిల్లీలో తెలంగాణ పదమే పలకడానికి, వినడానికి అవకాశాల్లేని పరిస్థితుల నుంచి ఇక్కడి నడిబొడ్డున భారాస సొంత కార్యాలయ భవనాన్ని నిర్మించుకునే స్థాయికి చేరుకోవడం చాలా ఆనందంగా ఉంది’ అని మంత్రి ప్రశాంత్‌రెడ్డి పేర్కొన్నారు.. భారాస కేంద్ర కార్యాలయం పనులను సంతోష్‌కుమార్‌తో కలిసి సోమవారం ఆయన పరిశీలించారు.
You may also like
సీ ఈ సీ రాజీనామాకు 48 గంటల గడువు… కాక్రోచ్ జనతా పార్టీ
రాజ్యాధికారం సాధన ద్వారా నే దళిత బహుజన కులాల కు విముక్తి ; దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షులు వడ్లమూరి. కృష్ణ స్వరూప్
కాంగ్రెస్ ప్రభుత్వ 420 హామీలతో అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేసింది…
రాష్ట్రస్థాయి ఆర్చరీ పోటీలను ప్రారంభించిన జిల్లా అధ్యక్షుడు తీగల తిరుమల గౌడ్…
రైతుల అభ్యున్నతే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యం ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్…


