అల్లిపూడి లో చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టును వ్యతిరేఖిస్తూ తెలుగుదేశం పార్టీ కోటనందూరు మండల యువ నాయకులు అంకంరెడ్డి బుల్లిబాబు ఆధ్వర్యంలో ‘న్యాయానికి సంకెళ్ళు’ కార్యక్రమాన్ని చేపట్టారు ఈ కార్యక్రమంలో గ్రామం లోని తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని తమ చేతులకు తాడులతోనూ,రిబ్బన్లతోనూ సంకెళ్ళు వేసుకొని అక్రమ అరెస్ట్ కు వ్యతిరేఖంగా వినూత్న రీతిలో నిరసనలు తెలిపారు. అంతే కాకుండా ‘న్యాయానికి ఇంకెన్నాళ్ళు సంకెళ్ళు’ అంటూ మాజీ ముఖ్యమంత్రి చంద్ర బాబు నాయుడు అక్రమ అరెస్ట్ ను ఉద్దేశిస్తూ పెద్దఎత్తున నినాదాలు చేశారు ఈ సందర్భంగా అంకంరెడ్డి బుల్లిబాబు మాట్లాడుతూ ఈ రాష్ట్ర అభివృద్ది కోసం అహర్నిశలు కృషి చేస్తున్న మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబును అక్రమంగా అరెస్ట్ చేయటం సిగ్గుచేటని అప్రజాస్వామ్యమని రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారని వచ్చే ఎన్నికలలో తెలుగుదేశం అధికారం లోకి రావడం ఖాయమని ఆయన అన్నారు. ఈ కార్యక్రమం లో అంకంరెడ్డి గోపి, చింతకా యల సురేష్, చింతకాయల కొండబాబు,పసగడుగుల అప్పలకొండ తదితరులు పాల్గొన్నారు.
You may also like
రైతుల పంటల సరపరలో విఫలమైన కాంగ్రెస్ ప్రభుత్వం…
యశోద ఆసుపత్రిలో అరుదైన శాస్త్ర చికిత్స ప్రతి సెకను ఎంతో విలువైనది…
న్యూరో ఇండోస్కోపీ, రోబోటిక్స్, అధునాతన ఇన్వసివ్ బ్రెయిన్ వెన్న ముఖ సంరక్షణ…
అల్లిపూడి ఎస్సీ కాలనీ అభివృద్ధికి ఎమ్మెల్యే యనమల దివ్య గారి బాటలు… ధన్యవాదాలు తెలిపిన టిడిపి మహిళా కార్యకర్త కొండ్రు రవణమ్మ
ఆంధ్రప్రదేశ్ లో అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ అమలు చేసి న్యాయవాదులకు రక్షణ కల్పించాలి. న్యాయవాది కొండ్రు కళ్యాణ్.


