జమ్మి పూజ
సూర్యాపేట అక్టోబర్ 23,(అఖండ భూమి) మున్సిపాలిటీ పరిధిలో 12వ వార్డులో శ్రీమహాదేవ నామేశ్వర స్వామి వారిని జమ్మి పూజ చేసుకొని బాండి మేళాలతో ఉత్సవ విగ్రహాలని ఊరేగించి. శివాలయ చైర్మన్ జేరిపోతుల బిక్షం గౌడ్ మాట్లాడుతూ హిందువుల ముఖ్యమైన పండుగ. ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుండి ఆశ్వయుజ శుద్ధ నవమి వరకు తొమ్మిది రోజులు దేవీ నవరాత్రులు పదవ రోజు విజయ దశమి కలసి దసరా అంటారు. ఇది ముఖ్యముగా శక్తి ఆరాధనకు ప్రాధాన్యత ఇచ్చే పండుగ. ఈ పండుగను నవరాత్రి, శరన్నవరాత్రి అని అంటారు. శరదృతువు ఆరంభంలో వచ్చే పండుగ కనుక ఈ పేరు వచ్చింది. కొందరు ఈ పండుగకు మొదటి మూడు రోజులు పార్వతిదేవికి తరువాతి మూడు రోజుల లక్ష్మీ దేవికి తరువాత మూడురోజులు సరస్వతి దేవికి పూజలు నిర్వహిస్తారు. ముఖ్యముగా శాక్తేయులు దీనిని ఆచరిస్తారు. బొమ్మల కొలువు పెట్టడం ఒక ఆనవాయితీ. ఆలయాలలో అమ్మవారికి ఒక్కోరోజు ఒక్కో అలంకారం చేస్తారు. పదవరోజు పార్వేట ఉంటదసరా పండుగ విజయదశమి నాడు జరుపుకోవడం జరుగుతుంది. తెలుగు వారు దసరాని పది రోజులు జరుపుకుంటారు. అని అన్నాడు. ఇ కార్యక్రమంలో అర్చకులు మునగలేటి సంతోష్ శర్మ, 12వ వార్డ్ కౌన్సిలర్ బచ్చలకూరి శ్రీనివాస్, గ్రామ పెద్దలు, రాపర్తి సైదులు, జేరిపోతుల సత్యనారాయణ, సంద సైదులు, కోడి నాగరాజు, సైదులు, శంకర్, జానకి రాములు, నాగయ్య, కేశవులు, నరేందర్, గౌతమ్, శంకర్, సంజీవ తదితరులు పాల్గొన్నారు