ఆర్మూర్ సిఐ రవికుమార్ కు స్థానచలనం..

 

ఆర్మూర్ సిఐ రవికుమార్ కు స్థానచలనం..

-ఐజి కార్యాలయంలో రిపోర్ట్ చేయాలని ఆదేశం..

నిజామాబాద్ జిల్లా ప్రతినిధి నవంబర్:07 (అఖండ భూమి) ఆర్మూర్. మల్టీ జోన్-1. పరిధిలో పలువురు సిఐలను బదిలీ చేస్తూ ఐజి చంద్రశేఖర్ రెడ్డి బుధవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. నిజామాబాద్ జిల్లా కమిషనరేట్ పరిధిలో ఆర్మూర్ సిఐ రవికుమార్. నార్త్ రూరల్ సీఐ సతీష్. రుద్రూర్ సీఐ జయశ్ రెడ్డి. టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ పురుషోత్తం లకు స్థాన చలనం చేశారు. ఆర్మూర్ సీఐ రవికుమార్ 2024 జనవరిలో పదవి బాధ్యతలను స్వీకరించి పదకొండు నెలపాటు తన వృత్తి ధర్మాన్ని నెరవేర్చుతూ. రాజకీయ అటుపోట్లను ఎదుర్కొని సఫలీకృతుడయ్యారు. సీఐ రవికుమార్ స్థానంలో డిజిపి కార్యాలయం నుండి నూతనంగా సీఐ సత్యనారాయణ ఆర్మూర్ ఎస్హెచ్ఓ గా పదవి బాధ్యతలు స్వీకరించనున్నట్లు సమాచారం.

Akhand Bhoomi News

error: Content is protected !!