కొవ్వూరు మండలం లో రాక్స్ టీమ్ పర్యటన
కొవ్వూరు మండలం వాడపల్లి గ్రామం లో రాక్స్ అధినేత డాక్టర్ అర్ ఎస్ రత్నాకర్ గారి ఆదేశాల మేరకు రాక్స్ టీమ్ పర్యటించారు.డాక్టర్ ఆర్ఎస్ రత్నాకర్ అనేక రోజులుగా కుట్ర పూరిత ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక గర్జన (రాక్స్) ద్వారా వందలాది గ్రామాల్లో పర్యటిస్తూ లక్షల సంఖ్యలో ప్రజలను ఉద్యమం వైపు ఉత్తేజపరుస్తూ అలుపెరుగని పోరాటం చేస్తున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగా రాక్స్ టీమ్ కుట్రపూరిత ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక ఉద్యమ చైతన్య సభ వాడపల్లి లో నిర్వహించారు. ఈ సందర్భం గా రాక్స్ రాష్ట్ర కోఆర్డినేటర్ బి. నారాయుడు, మాట్లాడుతూ ఎస్సీల వర్గీకరణ విరుద్ధమని జాతుల మధ్య చిచ్చు పెట్టే రాజకీయ కుట్రని అన్నారు. దీని వలన కలిగే నష్టాలను ప్రజలకు తెలియజేస్తూ రాక్స్ అధినేత డాక్టర్ రత్నాకర్ గారి ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని గ్రామాల్లోని ప్రజలు రాక్స్ సభకు పెద్ద ఎత్తున మద్దతునిస్తూ కదలివస్తున్నారని ఆనందం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమం లో రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ డి నాగరాజు, ఉమ్మడి గోదావరి జిల్లాల ఇన్చార్జి జి వెంకటేశ్వరరావు,రిటైర్డ్ ప్రిన్సిపాల్ భాస్కర్ ,పోస్ట్ మాస్టర్ నరసింహ పాల్గొన్నారు.
You may also like
-
రాష్ట్ర మాల కార్పొరేషన్ డైరెక్టర్ కొండ్రు మరిడియ్య కు అభినందనలు తెలిపిన రాక్స్ సెక్రెటరీ కొండ్రు కళ్యాణ్
-
*ప్రభుత్వ విఫ్ ఆదేశాలతో* *దిగివచ్చిన ఫార్మా కంపెనీలు*
-
ఎస్సీ వర్గీకరణ ఏక సభ్య కమిషన్ ను తక్షణమే రద్దు చేయాలి – డాక్టర్ ఆర్ఎస్ రత్నాకర్
-
చిరు వ్యాపారుల దుకాణాల తొలగింపులో నా ప్రమేయం లేదు..
-
మంత్రి జూ పల్లి కార్యక్రమంలో అపశృతి..