*చొప్పెల్లలో వైభవంగా అయ్యప్ప పడిపూజ.*
ఆలమూరు నవంబర్ 5 (అఖండ భూమి):అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆలమూరు మండలం చొప్పెల్ల రైస్ మిల్లు ఆవరణలో అయ్యప్ప స్వామి పడిపూజ మహోత్సవం వైభవంగా జరిగింది. గ్రామానికి చెందిన మురకొండ వెంకటేశ్వరరావు 18 వ సారి అయ్యప్ప మాల ధరించి శబరిమలై యాత్ర చేపడుతున్న సందర్భంగా ఈ పడిపూజను ఏర్పాటు చేశారు. కడియం మండలం తాడాల వీర వెంకటరావు గురుస్వామి ఆధ్వర్యంలో గుంటూరు జిల్లా రేపల్లె కు చెందిన శంకర గురుస్వామి ఈ పడిపూజ మహోత్సవాన్ని నిర్వహించారు.అద్బుతంగా పద్దెనిమిది మెట్లు వేదికను తీర్చిదిద్దారు. ఆద్యంతం ఎంతో భక్తి శ్రద్ధలతో ఈ పడిపూజ జరిగింది. కొత్తూరు సతీష్ శర్మ మంత్రోత్సవాలు మధ్య పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం ఈ పడిపూజ ను కన్నుల పండువగా జరిపించారు. శంకర్ గురుస్వామి అద్భుతమైన ప్రసంగాలు, ఉర్రూతలూగించే భక్తి గేయాలతో భక్తులను విశేషంగా అలరించారు. ఈ ప్రాంతంలో మండల దీక్షలకు సంబంధించి తొలిసారిగా ఈ పడిపూజ జరగడంతో ఆలమూరు మండలం తో పాటు కడియం, మండపేట పరిసర ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున అయ్యప్ప స్వాములు తరలి వచ్చారు.వీరందరి సమక్షంలో వెంకటేశ్వరరావు గురు స్వామి బాధ్యతలు స్వీకరించారు. అయ్యప్ప మాల ధరించిన రావులపాలెం రూరల్ సిఐ సిహెచ్ విద్యాసాగర్ ఈ పడిపూజకు విచ్చేసి పూజలు నిర్వహించారు.
You may also like
-
రాష్ట్ర మాల కార్పొరేషన్ డైరెక్టర్ కొండ్రు మరిడియ్య కు అభినందనలు తెలిపిన రాక్స్ సెక్రెటరీ కొండ్రు కళ్యాణ్
-
*ప్రభుత్వ విఫ్ ఆదేశాలతో* *దిగివచ్చిన ఫార్మా కంపెనీలు*
-
ఎస్సీ వర్గీకరణ ఏక సభ్య కమిషన్ ను తక్షణమే రద్దు చేయాలి – డాక్టర్ ఆర్ఎస్ రత్నాకర్
-
చిరు వ్యాపారుల దుకాణాల తొలగింపులో నా ప్రమేయం లేదు..
-
మంత్రి జూ పల్లి కార్యక్రమంలో అపశృతి..