దోపిడీకి రంగం సిద్ధం..?

 

 

దోపిడీకి రంగం సిద్ధం..?

-డబ్బులు వసూలు చేస్తున్నారని నేతపై ఆరోపణలు..?

-గతంలోనూ ఆ నేతపై కమిషనర్ కు ఫిర్యాదులు..?

-20, వేల నుండి. 50.వేలు వసూల్..?

నిజామాబాద్ జిల్లా ప్రతినిధి నవంబర్: 04(అఖండ భూమి) ఆర్మూర్ ప్రాంత రైతులు. వ్యాపారులు ఎదురుచూసిన వెజ్ కూరగాయల మార్కెట్ ను టియుఎఫ్ఐడిసి నిధులు 1.75 కోట్లతో 2018లో పనులు ప్రారంభించి పూర్తి చేశారు. 2019 ఫిబ్రవరి 21న. అప్పటి ఎమ్మెల్యే జీవన్ రెడ్డి అధికారికంగా ప్రారంభించారు. రెండు బ్లాకుల్లో 58 మడిగెలు కట్టారు. మడిగెల నిర్మాణం ఎట్టకేలకు పూర్తయిన వ్యాపారులకు మడిగెల కేటాయింపులో తీవ్ర జాప్యం జరిగింది. మడిగెల కేటాయింపు మళ్లీ తెరపైకి రావడంతో వెజ్ కూరగాయల మార్కెట్ కు సంబంధించిన ఓ నేత మడిగెలు ఇప్పిస్తానని వ్యాపారుల నుండి డిపాజిట్ డబ్బులు కాకుండా 20వేల నుండి 50 వేలు వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు చర్చ నియాంశమయ్యాయి. గతంలో ఈ నేత అక్రమాలపై బిజెపి నేతలు అప్పటి కమిషనర్ జగదీశ్వర్ గౌడ్ కు ఫిర్యాదు చేశారు. మళ్లీ ఇప్పుడు ఈ నేత ఎంట్రెన్స్ గేటు ప్రక్కనగల మడిగెలకు ఒక రేటు. లోపల మడిగెలకు మరో రేటును తానే నిర్ణయించి వ్యాపారస్తుల నుండి డబ్బులు వసూలు చేస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే కొంతమంది బాధితులు డబ్బులు చెల్లించినట్లు తెలిసింది. మడిగెలు అర్హులైన వ్యాపారస్తులకు దక్కేనా అన్న సందేహం వ్యక్తం అవుతుంది.

-అర్హులకే కేటాయిస్తాం..

రాజు మున్సిపల్ కమిషనర్ ఆర్మూర్..

మడిగేల కేటాయింపులో అక్రమాలకు తావులేదు. మడిగెల దారులకు డిపాజిట్ కింద ఒక్కొక్కరికి 20వేల రూపాయలు

తీసుకుంటున్నాం.బయట వ్యక్తులకు ఎవరు డబ్బులు ఇవ్వొద్దు. లబ్ధిదారులకు ఎంపిక చేసి మడిగెలను అర్హులైన వ్యాపారస్తులకు పారదర్శకంగా కేటాయిస్తాం.

Akhand Bhoomi News

error: Content is protected !!