అల్లూరులో ఉపాధి హామీ గ్రామసభ మొక్కుబడిగానే
- గ్రామ ప్రజలకు అవగాహన కరువు
వార్డ్ నెంబర్లు
సమాచారం ఏది
అధికారులు అతి నిర్లక్ష్యం
బాపట్ల క్రైమ్ బ్యూరో నవంబర్ 2 (అఖండ భూమి) :
పిట్టల వాని పాలెం మండలంలోని అల్లూరు గ్రామం సచివాలయం వద్ద శనివారం మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకంలో గ్రామంలో జరిగిన ఉపాధి హామీ పనులపై గ్రామసభను ఇటు ఎనర్జీ ఎస్ ఉపాధి హామీ పథకం అధికారులు ఇటు గ్రామ పంచాయతీ అధికారులు మొక్కుబడిగా తూతూ మంత్రంగానే నిర్వహించారు ఈ గ్రామ సభ పై
గ్రామంలో కనీసం దండోరా అవగాహన కల్పించలేదు ఇటు గ్రామ ప్రజలకు కానీ వార్డు నెంబర్లకు కానీ ఎలాంటి సమాచారం ఇవ్వకుండా
అధికారుల కనుసన్నాల్లోనే తూతూ మంత్రంగా నిర్వహించి చివరికి చేతులు దులుపుకున్నారు
అంటే అధికారులు పనితీరుకు అతి ఉత్సాహానికి అద్దం పడుతుంది ఈ విషయంపై ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్ శివరావును వివరణ కోరగా గ్రూపులో మెసేజ్ పెట్టామని గ్రామ సభ పై గ్రామాల్లోని (మేట్లకు) గ్రూప్ లీడర్లకు మాత్రమే తెలియ పరిచాము అందరూ మనవాళ్లే కదా అని చేతులు దులుపు కొన్నాము అన్నారు
ఈ విషయంపై పంచాయతీ కార్యదర్శి ఆట్ల పద్మావతి వివరణ కోరెందుకు ప్రయత్నించగా ఆమె ఫోన్ కాల్ తీసి మరల ఫోన్ కట్ చేశారు తర్వాత అందుబాటులోకి రాలేదు
ఈ విషయంపై మండల పరిషత్ అభివృద్ధి అధికారి సత్యనారాయణ ను వివరణ కోరగా ఆయన వెంటనే స్పందిస్తూ
గ్రామ సభపై గ్రామ ప్రజలకు వార్డు నెంబర్లకు తెలియ చేయవలసిన బాధ్యత ఉందన్నారు
ఈ విషయంపై ఏపీఓ సుభాషిని పంచాయతీ కార్యదర్శి పద్మావతిని
వివరణ అడుగుతానని
ఇలాంటి పొరపాట్లు జరగకుండా చూస్తాను అన్నారు