ఆలమూరు జూనియర్ కాలేజీలో టేకు దుంగలు వేలం.*

*ఆలమూరు జూనియర్ కాలేజీలో టేకు దుంగలు వేలం.*

ఆలమూరు (అఖండ భూమి):మండల కేంద్రం ఆలమూరు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో వివిధ సైజులలో ఉన్న 26 టేకు దుంగలను ఈనెల అనగా
నవంబర్ ఆరవ తేదీ నాడు
బహిరంగ వేలం వెయ్యడానికి నిర్ణయించినట్లు ప్రిన్సిపాల్ (ఎఫ్ఏసి) కృష్ణ తెలిపారు.
ఆసక్తి గల వారంతా ఈ
వేలంలో పాల్గొనవచ్చని
నాలుగవ తేదీ సాయంత్రంలోపు
సదరు కలపను పరిశీలించుకుని
తిరిగి ఇవ్వబడని రిజిస్ట్రేషన్ రుసుముగా రూ.500 లను చెల్లించాలని తెలిపారు.
అనంతరం వేలం పాటలో పాల్గొనదలచిన వారు( తిరిగి చెల్లించే విధంగా) రూ.5వేలను ధరావత్తుగా చెల్లించి వేలంలో పాల్గొనాలని తెలిపారు.
వేలాన్ని రద్దు పరచడానికి కానీ వాయిదా వేయడానికి
కానీ కళాశాల ప్రిన్సిపాల్ కి
పూర్తి అధికారాలు ఉన్నాయని
ఆసక్తి కలిగిన వాళ్లు నాలుగవ తేదీ సాయంత్రం లోపల రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించి వేలంలో పాల్గొనడానికి తమ పేరును నమోదు చేసుకోవచ్చని తెలిపారు.

Akhand Bhoomi News

error: Content is protected !!