ప్రజలకు సురక్షితమైన నీటిని సమృద్ధిగా అందించాలి….
జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్…
జాయింట్ కలెక్టర్ టి.నిశాంతి…
అమలాపురం( అఖండభూమి)
జలజీవన్ మిషన్, కార్పొరేట్ సామాజిక బాధ్యత, ఎంపీ లాడ్స్ క్రింద మంజూరైన నీటి సరఫరా అభివృద్ధి పనులు నిర్దేశిత గడువులోపుగా పూర్తి చేస్తూ ప్రజలకు సురక్షిత త్రాగు నీటిని సమృద్ధిగా సరఫరా చేయాలని జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ గ్రామీణ నీటి సరఫరా పారిశుద్ధ్య విభాగం ఇంజనీర్లను ఆదేశించారు మంగళవారం స్థానిక కలెక్టరే ట్లోని జిల్లా కలెక్టర్ ఛాంబర్ నందు కోనసీమ జిల్లాలో త్రాగు నీటి వసతుల కల్పన, సి పి డబ్ల్యూ ,ఫి డబ్ల్యూ స్కీములు ఆపరేషన్, నిర్వహణ అంశాల పురోగతిపై సమీక్షించారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ వివిధ గ్రాంట్ల కింద వివిధ అభి వృద్ధి పనుల కోసం మంజూరైన నిధులుకు సంబంధించి డాక్యు మెంటేషన్ టెండర్ ప్రక్రియ నిర్వహణ పనులు ప్రారంభం పురోగతి అంశాలపై స్పష్టమైన నివేది కలను నియోజకవర్గ మండల స్థాయిలలో రూపొం దించి సమర్పించాలని ఆదేశిం చారు. జల జీవన్ మిషన్ మూడు దశలలో చేపట్టిన పను లు పురోగతిపై ఆరాతీశారు. పనుల స్థితిగతులు నిర్దేశింత గడువులు, ఆవాసాల వారీగా టాప్ కనెక్షన్ల వివరాలు పై కలెక్టర్ సమీక్షించారు.మొదటి దశలో కుళాయి కనెక్షన్లు లేని ఆవాసాలకు డిస్ట్రి బ్యూషన్ పైప్ లైన్ వేయడం జరి గిందని, రెండో దశలో రేట్రో ఫిటింగ్ వర్కులు పురోగతిలో ఉన్నా యని మూడో దశలో ఓవర్ హెడ్ ట్యాంకులు నిర్మా ణానికి చర్యలు తీసుకోవడం జరిగిం దని ఆర్డబ్ల్యూఎస్ సూపరింటెం డెంట్ ఇంజనీర్ సిహెచ్ ఎన్వి కృష్ణారెడ్డి జిల్లా కలెక్టర్ కు తెలిపారు.అదేవిధంగా మూడు దశలలో జల జీవన్ మిషన్ కింద 1821 పనులు వివిధ కేటగిరీల కింద చేపట్టడం జరిగిందని ఎస్ ఇ తెలిపారు. ఈ పనుల నిర్వహణలో ఏవై నా సమస్యలు ఉత్ప న్నమైతే తమ దృష్టికి తెచ్చి పరిష్కార మార్గాలు కోరాలని జిల్లా కలెక్టర్ తెలిపారు.చిట్ట చివరి లబ్ధిదారునీ వరకు కుళాయి కనెక్షన్లు అందించాలని ఆయన స్పష్టం చేశారు.గ్రామీణ ప్రాంతా ల్లో సురక్షిత త్రాగునీరు పారిశు ద్ధ్య సౌకర్యాల కల్పనపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించా రు.స్కీములు నిర్వహణకు సంబంధించి టెండర్ల ప్రక్రియ పై ఆయన ఇంజనీర్లకు పలుసూచ
నలు ఆదేశాలు జారీచేశారు. జిల్లాలోని గ్రామీణ ప్రాంతంలో శాశ్వత త్రాగునీటి భద్రత కల్పించాలన్నారు. ఇప్పటికే ఉన్న త్రాగునీటి వనరులను మెరుగుపర్చి భూగర్భ జలా లు,ఉపరితల జలాలు వర్షపు నీటి సంరక్షణ భద్రత చర్యలను పటిష్టం గావించాలన్నారు నీటి నాణ్యత పర్యవేక్షణ నిఘా వ్యవస్థలు అంకితభావం జవా బుదారితనంతో పనిచేస్తూ ఇంటిస్థాయిలో నీటి కాలుష్యా నికి ఆస్కారం లేకుండా పటిష్ట మైన చర్యలు గైకొనాలన్నారు . అంగన్వాడీ కేంద్రాలకు త్వరిత గతిన కుళాయి కనెక్షన్లు, రన్నిం గ్ వాటర్ తో మరుగుదొ డ్లు నిర్మాణాలు వేగవంతం చేస్తూ ఆయా వసతులను అందుబా టులోనికి తేవాలన్నారు పరిశు భ్రత బహిరంగ మలవిసర్జనను తొలగించడం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో సాధారణ జీవన నాణ్యతను మెరుగుపరచా లన్నారు.ఈ కార్యక్రమంలో ఆర్డ బ్ల్యూఎస్ ఇంజనీర్లు పద్మనా భం, రామ్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.