అల్లిపూడి లో చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టును వ్యతిరేఖిస్తూ తెలుగుదేశం పార్టీ మండల యువ నాయకులు అంకంరెడ్డి బుల్లిబాబు ఆధ్వర్యంలో ‘న్యాయానికి సంకెళ్ళు’ కార్యక్రమాన్ని చేపట్టారు ఈ కార్యక్రమంలో గ్రామం లోని తెలుగు దేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని తమ చేతులకు తామే తాడులతోనూ,రిబ్బన్లతోనూ సంకెళ్ళు వేసుకొని అక్రమ అరెస్ట్ కు వినూత్న రీతిలో నిరసనలు తెలిపారు ‘న్యాయానికి ఇంకెన్నాళ్ళు సంకెళ్ళు’ అంటూ మాజీ ముఖ్యమంత్రి చంద్రాబాబు నాయుడు అక్రమ అరెస్ట్ ను ఉద్దేశిస్తూ పెద్దఎత్తున నినాదాలు చేశారు. అంకంరెడ్డి బుల్లిబాబు మాట్లాడుతూ ఈ రాష్ట్ర అభివృద్ది కోసం అహర్నిశలు కృషి చేస్తున్న మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబును అక్రమంగా అరెస్ట్ చేయటం సిగ్గుచేటని అప్రజాస్వామ్యమని రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారని వచ్చే ఎన్నికలలో తెలుగుదేశం అధికారం లోకి రావడం ఖాయమని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో అంకం రెడ్డి గోపి,చింతకాయల సురేష్, చింతకాయల కొండబాబు, పసగడుగుల అప్పలకొండ తదితరులు పాల్గొన్నారు.
You may also like
తిరుమల లడ్డు అవాస్తవాలు ప్రచారం చేస్తున్న వారిపై చర్యలు
బాల్యవివాహాల నిర్మూలన పై అవగాహన
గునుపూడిలో ‘పండుగ’ శోకం: పేదల పెన్షన్లకు కన్నం.. అక్రమార్కుల జేబుల్లోకి వెయ్యి రూపాయలు!
నూతన పాలకవర్గం భక్తులకు మరింత మెరుగైన సేవలు అందించాలి…
ది న్యూ రాజమండ్రి ప్రవైట్ ఎలక్ట్రికల్ వర్కర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ 7వ ఎలక్ట్రీషియన్ డే వార్సికోత్సవం


