కోటనందూరు మండలం అల్లిపూడి లో తెలుగు దేశం పార్టీ ప్రతిష్టాత్మక కార్యక్రమం ‘న్యాయానికి సంకెళ్ళు’ కార్యక్రమంను చేపట్టాలని తెలుగుదేశం పార్టీ మండల యువ నాయకులు అంకంరెడ్డి బుల్లిబాబు పార్టీ కార్యకర్తలకు అభిమానులకు ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రజలు కార్యకర్తలు రాత్రి 7 గంటలకు చేతులకు తాడు లేక రిబ్బను కట్టుకుని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అక్రమ అరెస్ట్ ను ఖండిస్తూ నిరసన తెలపాలని ‘న్యాయానికి ఇంకెన్నాళ్ళు సంకెళ్లు’ అంటూ నినాదాలు చేయాలని ఆయన కోరారు వైసీపీ పాలన లో వ్యవస్థలను నిర్వీర్యం చేస్తున్నారని అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని బుల్లిబాబు అన్నారు అంతే కాకుండా డి ఎస్సీ తో టీచర్ ఉద్యోగాలు భర్తీ చేయలేదని,ప్రతీ ఏటా జాబ్ కాలండర్ విడుదల చేస్తామని మరియు మద్యపాన నిషేధం అని పలు హామీలను చెప్పి ఓట్లు వేయించుకుని గెలిచి ఆ తరువాత వాటిని తుంగలో తొక్కి నిరుద్యోగుల నోట్లో మట్టి కొట్టారని ఆయన అన్నారు వాటిని గురించి ప్రశ్నిస్తే అక్రమ కేసులతో నియంత లా ప్రజల గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారని ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని ఆయన అన్నారు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అక్రమ అరెస్ట్ ను ప్రజలు జీర్ణించుకోలేక పోతున్నారని వచ్చే ఎన్నికలలో వైసీపీ కి ప్రజలే బుద్ది చెబుతారని తునిలో యనమల దివ్య గెలుపు తధ్యమని కార్యకర్తలు మరింత ఉత్సాహంగా కృషి చేయాలని ఆయన కోరారు
You may also like
అప్రెంటిస్షిప్ చట్టం ప్రకారం వేతనం తప్పనిసరి.. హ్యూమన్ రైట్స్ రాష్ట్ర అధ్యక్షులు:- నారాయుడు
ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలి కలెక్టర్…
బి సిల ఆణిముత్యం రత్నప్ప కుంభార్ సేవలు యువతకు స్ఫూర్తి
మా విద్యార్థులు ఎక్కువ మంది హిందీ నేర్చుకోవాలని మేం కోరుకుంటున్నాం: రష్యా మంత్రి…
దోమకొండ ఊరడమ్మ వీధిలో శానిటేషన్ కార్యక్రమం