అనకాపల్లి జిల్లా(అఖండ భూమి) అప్రెంటిస్‌షిప్ యాక్ట్, 1961, సెక్షన్ 13 ప్రకారం, తప్పనిసరిగా యజమాని అప్రెంటిస్ చేస్తున్న కాలం లో వేతనం చెల్లించాలి. మరియు ఈ వేతనం కనీస వేతనం చట్టం (Minimum Wages Act) ప్రకారం నిర్ణయించబడుతుంది లేదా కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన రేట్ల ప్రకారం ఉండాలని హ్యూమన్ రైట్స్ రాష్ట్ర అధ్యక్షులు బొండాడ నారాయుడు అన్నారు. కాగా అనకాపల్లి జిల్లా లో ఆసుపత్రి లలో GNM,MLT,MPHW తదితర కోర్స్ లలో భాగంగా అప్రెంటిస్ చేస్తున్న వారికి ఈ వేతనం విషయంలో ప్రభుత్వం స్పష్టత ఇవ్వకపోవడం తో స్టైఫండ్ లేక ఇబ్బంది ఎదుర్కొంటున్నారనీ ఆయన అన్నారు. అంతే కాకుండా అప్రెంటిస్ కాలం లో ఆసుపత్రి కార్యకలాపాలలో చురుకుగా పాల్గొంటూ రోగులకు సేవలు, ల్యాబ్ టెస్టులు, ఫార్మసీ సేవలు, రికార్డుల నిర్వహణ వంటి వాటిలో తమ వంతు కృషి చేస్తున్నారనీ, ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో, ఆర్థిక భారం చాలా ఎక్కువగా ఉందనీ, రవాణా, ఆహారం, మరియు ఇతర వ్యక్తిగత అవసరాల కోసం ఖర్చులు భరించడం కష్టంగా మారిందనీ అది వారి అప్రెంటిస్‌షిప్ పై ప్రభావం చూపుతోందనీ ప్రభుత్వం ఈ విషయాన్ని పరిశీలించి, వీలైనంత త్వరగా వారికి స్టైఫండ్ (గౌరవ వేతనం) చెల్లించే ఏర్పాటు చేయాలని ఆయన కోరారు.