అత్యధిక గ్రాడ్యుయేషన్లను తయారు చేసిన ఘనత కామారెడ్డి ఆర్కే గ్రూప్ ఆఫ్ కే దక్కుతుంది..!
రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడు మహమ్మద్ అలీ షబ్బీర్..
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; సెప్టెంబర్ 21 (అఖండ భూమి న్యూస్) కామారెడ్డి లో అత్యధికంగా గ్రాడ్యుయేషన్లను, పట్టబదురులను తయారు చేసిన ఘనత ఆర్కే గ్రూప్ ఆఫ్ కాలేజ్ కె దక్కుతుందని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడు మహమ్మద్ అలీ షబ్బీర్ అన్నారు. శనివారం కామారెడ్డి జిల్లా కేంద్రంలోని గ్రాడ్యుయేషన్ డే సందర్భంగా శుక్రవారం ఆయన ముఖ్య అతిథిగా హాజర ఈ సందర్భంగా మాట్లాడారు. గ్రాడ్యుయేషన్ పూర్తయిన వారికి పట్టాలను అందించారు వారు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలను వీక్షించారు. అనంతరం గ్రాడ్యుయేషన్ లో వివిధ గ్రూపులకు సంబంధించిన ఉత్తమ ప్రాతిప కనబరిచిన వారికి నగదు పారితోషకముతో పాటు పట్టాలను అందించారు. ఆయన మాట్లాడుతూ. ప్రతి ఒక్కరూ విద్యలో ప్రతిభ కనబరిచి ఆశించిన స్థాయిలో ఉన్నత శిఖరాలను చేరుకొని సత్తా చాటాలని ఆయన పిలుపునిచ్చారు. విద్యను అభ్యసించడానికి వయసు అడ్డురాదని అన్నారు. కేవలం మనదేశంలోనే కాకుండా పాశ్చాత్య దేశాల్లో సైతం భారతీయుల పాత్ర ఎంతో గొప్పదని అన్నారు. ప్రపంచంలోనే భారతీయులు విద్యలో రాణించే సత్తా కలిగిన యువత మన దేశంలోనే అత్యధికంగా ఉందని అన్నారు. భారతీయులంటే ప్రతిభ కనబరిచిన వారని, రేపటి భావి తరాలకు మార్గదర్శకులుగా ఉంటారని, అందరికీ ఆదర్శంగా ఉండాలని పిలుపునిచ్చారు పిలుపునిచ్చారు. విద్య ఉత్తీర్ణతలో ఆర్కే గ్రూప్ ఆఫ్ కాలేజీలు ముందు ఉండడం అభినందనీయమని అన్నారు. ప్రతి ఒక్కరూ ఇలాంటి కాలేజీలలో విద్యను అభ్యసించి భవిష్యత్తును పునర్ నిర్మించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆర్కే గ్రూప్ ఆఫ్ కాలేజ్ సిబ్బందితోపాటు, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.