కేసుల చేదన, సొత్తు రికవరీల్లో జిల్లాకు అత్యుత్తమ స్థానం…

కేసుల చేదన, సొత్తు రికవరీల్లో జిల్లాకు అత్యుత్తమ స్థానం…

 

జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర,..

కామారెడ్డి జిల్లా ప్రతినిధి; సెప్టెంబర్ 20 (అఖండ భూమి న్యూస్); కామారెడ్డి జిల్లా పోలీస్ శాఖ జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, నేరస్తులను వెంబడించి, పట్టుకొని, పరిష్కరించడం అనే స్లోగన్‌తో కూడిన సెంట్రల్ క్రైమ్ స్టేషన్ (సీసీఎస్) క్యాప్షన్ పోస్టర్‌ను శనివారం ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.

కామారెడ్డి జిల్లాలో ఈ సంవత్సరం ఆస్తి సంబంధిత దొంగతనాలలో 46% నేరాలను ఛేదించి 42% సొత్తు రికవరీ చేసి తిరిగి భాదితులకు అందజేసినట్లు తెలిపారు..

ఆస్తి సంబంధిత నేరాల ఛేదనలో ప్రతి కేసును వేగంగా పరిష్కారమార్గం చూపే విధంగా మన సెంట్రల్ క్రైమ్ స్టేషన్ (సిసిఎస్) వారు విధానాన్ని అనగా నేరస్తులు ఏమూలన దాగిఉన్న వారిని వెంబడించి, పట్టుకొని, కేసులు పరిష్కరించే విధంగా సిసిఎస్ వారి భాద్యతయుత విధులు ప్రతిబింబించేలా క్యాప్షన్ తో జిల్లా లోగోతో కూడిన వాటిని ఆవిష్కరించుకోవడం జరిగినది. దొంగతనాల నివారణకు ప్రతిరోజూ నాఖ భంధి, పెట్రో లింగ్, బీట్ డ్యూటీలు తీవ్రతరం చేసి పకడ్బంధి చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.

కామారెడ్డి సెంట్రల్ క్రైమ్ స్టేషన్ (సి సి ఎస్) ద్వారా ఈ సంవత్సరములో అంతరాష్ట్ర గ్యాంగ్ నేరస్థులపై ప్రత్యేక నిఘా ఉంచి మొత్తం 10 గ్యాంగ్ లను ఇప్పటివరకు పట్టుకోవడం జరిగింది. వీటిలో మహారాష్ట్ర-4, మధ్యప్రదేశ్-3, ఢిల్లీ, రాజస్థాన్ మరియు ఉత్తర్ ప్రదేశ్ కు చెందిన ఒక్కో గ్యాంగ్ ఉన్నది. ప్రజలకు దొంగలించిన సొత్తును తిరిగి బాధితులకు అందించడములో అత్యుత్తమ స్థానంలో నిలిచిందనీ అన్నారు. బాద్యతాయుతముగా, చాకచక్యముగా విధులు నిర్వహించి 46% నేరాలను ఛేదించి 42% సొత్తు రికవరీ చేసినందులకు సిసిఎస్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, యస్.ఐ ఉస్మాన్ , సిబ్బంది అంధరికి అభినందిస్తూ నగదు రివార్డులను అంధించారు.

నేరాల నివారణలో ప్రజల వైపు నుండి సహకారం అవసరమని ఎలాంటి అనుమానాస్పద వ్యక్తుల కదలికలు ఉన్న, అసాంఘిక కార్యకలాపాలు జరుగుచున్న వెంటనే సంభందిత పోలీసులకు లేదా డయల్ 100 కు సమాచారం ఇవ్వాలని వారి వివరాలు గోప్యంగా ఉంచబడుతాయి అని తెలిపినారు.

జిల్లా పోలీస్ వ్యవస్థ క్రమశిక్షణ , నిబద్ధతతో ప్రజలకు సేవలు అంధించదములో ముందుంటుంది అని ఎస్పీ స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో కామారెడ్డి ఏఎస్పి బి. చైతన్య రెడ్డి, ఐపి ‌ఎస్ , యెల్లారెడ్డి డిఎస్పి ఎస్. శ్రీనివాస్ రావు , బాన్సువాడ డిఎస్పి విట్టల్ రెడ్డి , స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ టి. శ్రీధర్ , సిసిఎస్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ , పోలీసు సిబ్భంది పాల్గొన్నారు.

Akhand Bhoomi News

error: Content is protected !!